Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2019: ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్, చెన్నైపై ఘన విజయం

IPL 2019,1st Qualifier: Mumbai Indians Won By 6 Wickets On Chennai Super Kings | Match Highlights
MI

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో తలపడనుంది. సీఎస్‌కే నిర్దేశించిన 132 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 71(10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ముంబైకి ఓపెనర్లు సరైన ఆరంభాన్న ఇవ్వలేకపోయారు. రోహిత్‌ శర్మ(4), డికాక్‌(8)లు తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఇషాన్‌ కిషాన్‌(28) ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దాడు.

సూర్యకుమార్ యాదవ్‌‌తో కలిసి మూడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం తాహీర్‌ బౌలింగ్‌లో ఇషాన్ కిషాన్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కృనాల్‌ పాండ్యా(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో హార్దిక్‌ పాండ్యా(13)తో కలిసి సూర్యకుమార్‌ యాదవ్(71 నాటౌట్) దూకుడుగా ఆడి ముంబైకి విజయాన్నందించాడు. చెన్నై బౌలర్లలో తాహీర్‌ రెండు వికెట్లు తీయగా, చాహర్‌, భజ్జీ తలో వికెట్‌ తీశారు.


ముంబై విజయ లక్ష్యం 132
అంతకముందు అంబటి రాయుడు 37 బంతుల్లో 42(3 ఫోర్లు), ధోని 29 బంతుల్లో 37(3 సిక్సులు)తో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్‌కి 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

1
45946

ఈ మ్యాచ్‌లో రాహుల్ చాహర్ వేసిన 3వ ఓవర్ తొలి బంతికి డుప్లెసిస్(6) అన్‌మోల్‌ప్రీత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత జయంత్ యాదవ్ వేసిన ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సురేశ్ రైనా(5) అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 12 పరుగులకే సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అనంతరం జట్టు స్కోరు 32 పరుగుల వద్ద ఆరో ఓవర్ చివరి బంతికి వాట్సన్(10) జయంత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనెదిరిగాడు. ఈ దశలో మురళీ విజయ్, అంబటి రాయుడు నిలకడగా ఆడారు. అయితే జట్టు స్కోరు 65 పరుగుల వద్ద మురళీ విజయ్(26) స్టంపౌట్ అయ్యాడు. విజయ్‌ ఔటవ్వగా ధోనీ క్రీజులోకి వచ్చాడు.

ఆ తర్వాత రాయుడితో కలిసి ధోని స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. వీరిద్దరూ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు తీయగా కృనాల్‌ పాండ్యా, జయంత్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పులతో బరిలోకి దిగాయి. చెన్నై జట్టులోకి కేదార్ జాదవ్ స్థానంలో మురళీ విజయ్, ముంబై జట్టులోకి మెక్లన్‌గన్ స్థానంలో జయంత్‌లకు చోటు కల్పించారు.

Story first published: Tuesday, May 7, 2019, 23:27 [IST]
Other articles published on May 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+