Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Qualifier 1 మ్యాచ్ హైలెట్స్: 300 వికెట్లు తీసిన తాహిర్, జడేజా 100

IPL 2019: Qualifier 1, Mumbai Indians vs Chennai Super Kings – Statistical Highlights

హైదరాబాద్: చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐదోసారి ఫైనల్‌కు చేరగా... సీఎస్‌కే మాత్రం ఈ సీజన్‌లో మరో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంబటి రాయుడు 37 బంతుల్లో 42(3 ఫోర్లు), ధోని 29 బంతుల్లో 37(3 సిక్సులు)తో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

అనంతరం సీఎస్‌కే నిర్దేశించిన 132 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 71(10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ముంబైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే ఓడిపోవడం విశేషం.

MI vs CSK మ్యాచ్‌లో నమోదైన గణాంకాలివే:

చెపాక్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై

చెపాక్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై

5 - చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ 2013 నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 24 మ్యాచ్‌లాడగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. చెపాక్ స్టేడియంలో సీఎస్‌కేపై ముంబై ఇండియన్స్‌ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఈ స్టేడియంలో ముంబైతో తలపడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట సీఎస్‌కే ఓడింది.

ముంబై చేతిలోనే రెండు సార్లు

ముంబై చేతిలోనే రెండు సార్లు

11-2 - 2013 నుంచి ఇప్పటివరకు ఈ స్టేడియంలో 13 మ్యాచ్‌లాడగా కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ తన లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ రెండు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ ముంబై చేతిలో ఓడిపోయింది.

2 - చెపాక్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఐపీఎల్ చరిత్రలో నాలుగు విదేశీ ఆటగాళ్లు లేకుండా కేవలం ముగ్గురు విదేశీ ప్లేయర్లతో బరిలోకి దిగడం ఇది రెండోసారి.

టీ20ల్లో 300వికెట్లు తీసిన ఇమ్రాన్ తాహిర్

టీ20ల్లో 300వికెట్లు తీసిన ఇమ్రాన్ తాహిర్

300 - ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా వికెట్ తీయడం ద్వారా ఇమ్రాన్ తాహిర్ టీ20ల్లో 300 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో మొత్తంగా ఈ ఘనత ఆరో బౌలర్ కాగా, దక్షిణాఫ్రికా తరుపున మొట్టమొదటి ఆటగాడు కావడం విశేషం.

రోహిత్ శర్మ 100% రికార్డు - చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మ భాగస్వామిగా ఉన్నాడు. డెక్కన్ ఛార్జర్స్ తరుపున రెండు, ముంబై ఇండియన్స్ తరుపున రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌లు ఆడాడు.

చెన్నై తరుపున 100వ మ్యాచ్ ఆడిన జడేజా

చెన్నై తరుపున 100వ మ్యాచ్ ఆడిన జడేజా

జడేజా @100 - చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున రవీంద్ర జడేజాకు ఇది 100వ మ్యాచ్. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(158), సురేశ్ రైనా(162) తర్వాత సీఎస్‌కే తరుపున 100 మ్యాచ్‌లాడిన మూడో ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు.

Story first published: Wednesday, May 8, 2019, 17:58 [IST]
Other articles published on May 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+