Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2019: Qualifier 1: చెన్నై టాపార్డర్ విఫలం, ముంబై విజయ లక్ష్యం 132

MS Dhoni

హైదరాబాద్: చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో అంబటి రాయుడు 37 బంతుల్లో 42(3 ఫోర్లు, సిక్స్), ధోని 29 బంతుల్లో 37(3 సిక్సులు)తో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్‌కి 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో రాహుల్ చాహర్ వేసిన 3వ ఓవర్ తొలి బంతికి డుప్లెసిస్(6) అన్‌మోల్‌ప్రీత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత జయంత్ యాదవ్ వేసిన ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సురేశ్ రైనా(5) అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 12 పరుగులకే సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అనంతరం జట్టు స్కోరు 32 పరుగుల వద్ద ఆరో ఓవర్ చివరి బంతికి వాట్సన్(10) జయంత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనెదిరిగాడు. ఈ దశలో మురళీ విజయ్, అంబటి రాయుడు నిలకడగా ఆడారు. అయితే జట్టు స్కోరు 65 పరుగుల వద్ద మురళీ విజయ్(26) స్టంపౌట్ అయ్యాడు. విజయ్‌ ఔటవ్వగా ధోనీ క్రీజులోకి వచ్చాడు.

ఆ తర్వాత రాయుడితో కలిసి ధోని స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. వీరిద్దరూ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు తీయగా కృనాల్‌ పాండ్యా, జయంత్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పులతో బరిలోకి దిగాయి.

చెన్నై జట్టులోకి కేదార్ జాదవ్ స్థానంలో మురళీ విజయ్, ముంబై జట్టులోకి మెక్లన్‌గన్ స్థానంలో జయంత్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో ఇరు జట్లు 14 పాయింట్లు సాధించినప్పటికీ... రన్ రేట్ విషయంలో మాత్రం ముంబై ఇండియన్స్ మెరుగ్గా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు ఇరు జట్లు 7 మ్యాచ్‌లాడగా ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 2 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఐపీఎల్ లీగ్‌లో లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా ముద్రపడ్డ ఈ రెండు జట్లు ఇప్పటికే చెరో మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచాయి. ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై విజయం సాధించింది.

1
45946

దీంతో ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో చెన్నైకి అదనపు బలం. 2008, 2010 సీజన్‌లో మాత్రమే సొంత వేదికలో ముంబైపై సీఎస్‌కే విజయం సాధించింది. తాజా సీజన్‌లో లీగ్‌లో ఇప్పటిదాకా ఆడిన 14 మ్యాచ్‌ల్లో ముంబై, చెన్నై తొమ్మిదేసి విజయాలతో ఉన్నాయి. లీగ్‌ దశలో రెండు సార్లు సీఎస్‌కేపై ముంబై గెలిచింది.

జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మురళీ విజయ్, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, లసిత్ మలింగ, బుమ్రా

Story first published: Tuesday, May 7, 2019, 22:09 [IST]
Other articles published on May 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+