క్వాలిఫయిర్ 1, MI vs CSK: మ్యాచ్ ప్రివ్యూ, గ్రౌండ్ గణాంకాలు, రికార్డులు

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లీగ్ దశ ముగిసింది. ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లు ఏవో కూడా తెలిసిపోయాయి. చెన్నై, ముంబై, ఢిల్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. టోర్నీలో భాగంగా మే 7వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సీజన్‌లో ఇరు జట్లు 14 పాయింట్లు సాధించినప్పటికీ... రన్ రేట్ విషయంలో మాత్రం ముంబై ఇండియన్స్ మెరుగ్గా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. అంతేకాదు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించగా... చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది.
మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి క్వాలిఫయిర్ జరగనున్న నేపథ్యంలో మ్యాచ్ ప్రివ్యూ ఒక్కసారి చూద్దాం...

MI vs CSK మ్యాచ్ డిటేల్స్
తేదీ: మంగళవారం, 7 May 2019
సమయం: 7.30 PM IST
వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై
లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్‌వర్క్
ఆన్ లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

చిదంబరం స్టేడియం గణాంకాలు
మొత్తం మ్యాచ్‌లు: 51
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచినవి: 32
ఫస్ట్ బౌలింగ్ చేసిన జట్టు గెలిచినవి: 19
ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి స్కోరు: 164
రెండో ఇన్నింగ్స్ యావరేజి స్కోరు: 151

హెడ్ టు హెడ్ రికార్డు
మొత్తం: 28
CSK: 12
MI: 16
చిదంబరం స్టేడియంలో హెడ్ టు హెడ్ రికార్డు
మొత్తం: 7
CSK: 2
MI: 5

కీలక ఆటగాళ్లు
చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, ధోని, ఇమ్రాన్ తాహిర్
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, బుమ్రా

జట్ల అంచనా
చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మురళీ విజయ్, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్, మిచెల్ మిక్లెన్ గన్, లసిత్ మలింగ, బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications