Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2019: Qualifier 1: చెన్నై బ్యాటింగ్, ఫైనల్ బెర్తు ఎవరిదో!

IPL 2019: Qualifier 1: Chennai Super Kings win the toss and elect to bat

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం జరుగుతున్న తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌ విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పులతో బరిలోకి దిగాయి. చెన్నై జట్టులోకి కేదార్ జాదవ్ స్థానంలో మురళీ విజయ్, ముంబై జట్టులోకి మెక్లన్‌గన్ స్థానంలో జయంత్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఈ సీజన్‌లో ఇరు జట్లు 14 పాయింట్లు సాధించినప్పటికీ... రన్ రేట్ విషయంలో మాత్రం ముంబై ఇండియన్స్ మెరుగ్గా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు ఇరు జట్లు 7 మ్యాచ్‌లాడగా ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 2 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఐపీఎల్ లీగ్‌లో లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా ముద్రపడ్డ ఈ రెండు జట్లు ఇప్పటికే చెరో మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచాయి. ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై విజయం సాధించింది.

సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో చెన్నైకి అదనపు బలం. 2008, 2010 సీజన్‌లో మాత్రమే సొంత వేదికలో ముంబైపై సీఎస్‌కే విజయం సాధించింది. తాజా సీజన్‌లో లీగ్‌లో ఇప్పటిదాకా ఆడిన 14 మ్యాచ్‌ల్లో ముంబై, చెన్నై తొమ్మిదేసి విజయాలతో ఉన్నాయి. లీగ్‌ దశలో రెండు సార్లు సీఎస్‌కేపై ముంబై ఇండియన్స్‌ గెలిచింది.

1
45946

జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మురళీ విజయ్, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, లసిత్ మలింగ, బుమ్రా

Story first published: Tuesday, May 7, 2019, 19:25 [IST]
Other articles published on May 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+