న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: ముంబైపై డ్వేన్ బ్రావో ప్రతీకారం తెరుచుకుంటాడా?

IPL 2019, Qualifier 1: Chennai Super Kings All Rounder Dwayne Bravo to seek his revenge against Mumbai Indians

ఐపీఎల్‌-12 చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం రాత్రి చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా క్వాలిఫయర్‌-1 మ్యాచ్ జరగనుంది. ఈ క్వాలిఫయర్‌-1లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో ముంబైపై తన ప్రతీకారంను తీర్చుకుంటాడేమో చూడాలి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

లీగ్‌ దశలో ముంబైతో రెండు సార్లు తలపడగా చెన్నైకి పరాభవమే మిగిలింది. ఈ రెండు మ్యాచ్‌లలో చెన్నై ఆటగాళ్లు ఎవరూ కూడా స్థాయికి దగ్గ ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో బ్రేవో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. వాంఖడే వేదికగా తలపడిన మొదటి మ్యాచ్‌లో బ్రేవో తన కోటా 4 ఓవర్లలో ఏకంగా 49 పరుగులు ఇచ్చాడు. పోలార్డ్, పాండ్యాల ధాటికి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 29 పరుగులు ఇచ్చాడు.

చేనై వేదికగా తలపడిన రెండవ మ్యాచ్‌లో బ్రేవో తన కోటా 4 ఓవర్లలో వికెట్ ఏమీ తీయకున్నా.. 35 పరుగులు సమర్పించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై 155 పరుగులు చేసినా బ్రేవో పరుగులను మాత్రం నియంత్రించలేదు. ఇక ఛేదనలో కూడా 17 బంతుల్లో కేవలం 20 పరుగులు చేసి విఫలమయ్యాడు. సీజన్-12లో ఇప్పటివరకు బ్రేవో తన మార్క్ ఆట ప్రదర్శించలేదు. ఈ రోజు కీలక క్వాలిఫయర్‌-1 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ముంబైపై చెలరేగి ప్రతీకారం తీర్చుకుంటాడేమో చూడాలి.

Story first published: Tuesday, May 7, 2019, 18:00 [IST]
Other articles published on May 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X