Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జీవాను నేను కిడ్నాప్‌ చేస్తా: ధోని వార్నింగ్ ఇచ్చిన ప్రీతి జింటా

IPL 2019 : Preity Zinta Jokes About MS Dhoni's Daughter Ziva || Oneindia Telugu
IPL 2019: Preity Zinta funnily warns MS Dhoni of kidnapping his daughter Ziva

హైదరాబాద్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యజమాని ప్రీతి జింటా వార్నింగ్‌ ఇచ్చారు. ఐపీఎల్ 12వ సీజన్ ప్లేఆఫ్స్‌కు రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా గత ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సమానంగా 12 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్‌రేట్‌ (-0.251)తక్కువగా ఉండటంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌ ఆరంభంలో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ 'మన్కడింగ్' ఔట్ చేయడంతో ఈ సీజన్‌లో ఎక్కువ మంది చర్చించుకున్న జట్టుగా నిలిచింది.

అయితే, ఈ సీజన్‌లో వరుసగా నాలుగు ఓటముల తర్వాత తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించడంపై ప్రీతిజింటా సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్‌లో స్టేడియంలో నవ్వుతూ ధోనీతో కరచాలనం చేస్తున్న ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

"నాతో పాటు కెప్టెన్ కూల్‌కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో తన దృష్టి ధోనీ కుమార్తె జీవాపై పడింది. నేను ధోనీని చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.. ఆయన కుమార్తె జీవాను నేను కిడ్నాప్‌ చేస్తా" అని ట్విట్టర్‌లో కామెంట్ పెట్టారు.

Story first published: Tuesday, May 7, 2019, 18:07 [IST]
Other articles published on May 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+