Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆగ్రస్థానంలో చెన్నై: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ ఎవరు కలిగి ఉన్నారంటే!

IPL 2019 Points Table, Orange Cap and Purple Cap holders: Updated after CSK vs SRH match

హైదరాబాద్: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు షేన్‌ వాట్సన్‌ 53 బంతుల్లో 96 (9 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఈ సీజన్‌లో ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ సొంతం చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చాన్నాళ్ల తర్వాత పాండే హాఫ్ సెంచరీ

చాన్నాళ్ల తర్వాత పాండే హాఫ్ సెంచరీ

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. చాన్నాళ్ల తర్వాత మనీశ్ పాండే 49 బంతుల్లో 83 నాటౌట్(7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు ఓపెనర్ డేవిడ్ వార్నర్ 45 బంతుల్లో 57(3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో సన్‌రైజర్స్ మంచి స్కోరు చేసింది.

పాయింట్ల పట్టిక

పాయింట్ల పట్టిక

అయితే, సన్‌రైజర్స్ నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో షేన్ వాట్సన్ విజృంభించడంతో 19.5 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 176 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. చెన్నై vs హైదరాబాద్ మ్యాచ్ అనంతరం పాయింట్ల పట్టిక ఇలా...

ఆరెంజ్ క్యాప్

ఆరెంజ్ క్యాప్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోలు ఆరెంజ్ క్యాప్ రేసులోనే ఉన్నారు. టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 574 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... జానీ బెయిర్ స్టో 445 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

పర్పుల్ క్యాప్

పర్పుల్ క్యాప్

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడ 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ 16 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Wednesday, April 24, 2019, 16:29 [IST]
Other articles published on Apr 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+