Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ప్లేఆఫ్స్: DC vs SRH: ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయమెవరిదో!

IPL 2019 : Delhi Capitals vs Sunrisers Hyderabad Eliminator Match Prediction || Oneindia Telugu
IPL 2019 Playoffs: Eliminator, DC vs SRH - Match Preview

హైదరాబాద్: ఢిల్లీ కాపిటల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ప్లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం జరగనున్న ఎలిమినేషన్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కి విశాఖపట్నం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్ల విశాఖకు చేరుకున్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఏడేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా... లీగ్ స్టేజిలో జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై చేతిలో కోల్‌కతా ఓటమి పాలవ్వడంతో కేవలం 12 పాయింట్లతోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

రెండు సార్లు హాట్రిక్‌ విజయాలు

రెండు సార్లు హాట్రిక్‌ విజయాలు

కాగా, ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు సార్లు హాట్రిక్‌ విజయాలు సాధించింది. మరోవైపు సన్‌రైజర్స్‌ విషయానికి వస్తే ఒక హాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌‌కి ఆతిథ్యమిస్తోన్న విశాఖపట్నం స్టేడియం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బాగా అచ్చొచ్చిన స్టేడియం.

ఢిల్లీపై సన్‌రైజర్స్ మెరుగైన రికార్డు

ఢిల్లీపై సన్‌రైజర్స్ మెరుగైన రికార్డు

అంతేకాదు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 14 మ్యాచ్‌లు జరగ్గా 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయం సాధించగా.... 5 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇక, విశాఖ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది.

ఇరు జట్లు చెరో మ్యాచ్

ఇరు జట్లు చెరో మ్యాచ్

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. ఇక, ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవగా.. మరొక మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించి ప్రతీకారాన్ని తీర్చుకుంది. విశాఖ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే ఆ జట్టు క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది.

మూడో స్థానానికి ఢిల్లీ క్యాపిటల్స్

మూడో స్థానానికి ఢిల్లీ క్యాపిటల్స్

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్‌ జట్లు 18 పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్‌రేట్‌తో ముంబై ఇండియన్స్‌ అగ్రస్థానంలో నిలవగా, చెన్నై రెండో స్థానంలోనూ నిలిచాయి. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్, కోల్‌కతా, పంజాబ్ జట్లు 12 పాయింట్లతో నిలిచినా హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.

DC vs SRH మ్యాచ్ డిటేల్స్

DC vs SRH మ్యాచ్ డిటేల్స్

తేదీ: బుధవారం, 8 May 2019

సమయం: 7:30 PM IST

వేదిక: Dr. YS Rajasekhara Reddy Cricket Stadium, Visakhapatnam

లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్‌వర్క్

ఆన్‌లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

జట్ల వివరాలు

జట్ల వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్

పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ ఇన్‌గ్రామ్, రూథర్‌ఫర్డ్, అక్షర పటేల్, కీమో పాల్, ట్రెంట్ బౌల్డ్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్

మార్టిన్ గుప్టిల్, సాహా, మనీష్ పాండే, విలియమ్సన్, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ

Story first published: Tuesday, May 7, 2019, 17:02 [IST]
Other articles published on May 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+