For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్వాలిఫయర్‌-1లో చెన్నై vs ముంబయి.. ఫైనల్‌కు వెళ్లేదెవరు?

IPL 2019 : MI V CSK Qualifier 1 Match Preview ! || Oneindia Telugu
IPL 2019, playoffs: CSK predicted XI against Mumbai Indians, MS Dhoni could make big call

ఐపీఎల్‌-12 చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా క్వాలిఫయర్‌-1 మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్‌-1లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. తొలి ప్లే ఆఫ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు నేరుగా చేరుకుంటుంది. ఇక ఓడిన జట్టుకు ఫైనల్‌ వెళ్లేందుకు మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. అయితే క్వాలిఫయర్‌-1లోనే సత్తా చాటి ఫైనల్ వెళ్లాలని చెన్నై, ముంబై చూస్తున్నాయి.

 రెండు బలమైన జట్లే:

రెండు బలమైన జట్లే:

క్వాలిఫయర్‌-1లో తలపడే చెన్నై, ముంబై రెండు జట్లూ బలమైనవే. రెండింటికీ లీగ్‌లో ఘన చరిత్రే ఉంది. చెరో మూడు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకున్నాయి. ఇక ప్రస్తుత సీజన్‌లో లీగ్‌ దశలో ఈ రెండు జట్లు తలపడగా.. ముంబై విజయం సాధించింది. అయితే ప్లే ఆఫ్‌ దశలో చెన్నై అద్భుతంగా ఆడుతుందనడంలో సందేహం లేదు. ముంబైకి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. వరుస విజయాలతో ముంబై కూడా ఆత్మవిశ్వాసంతో బరిలో దిగబోతోంది. రెండు జట్లలో బలమైన హిట్టర్లు ఉన్నారు. అదికాగా అందరు ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

పటిష్ట బ్యాటింగ్ లైనప్:

పటిష్ట బ్యాటింగ్ లైనప్:

చెన్నై బలమైన జట్టు. అదికాక ఇవాళ సొంతగడ్డపై ఆడనుండడం చెన్నైకి కలిసొచ్చే అంశం. చెన్నై ఇక్కడ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు గెలిచింది. చెన్నై బ్యాటింగ్, బౌలింగ్‌లలో పటిష్టంగా ఉంది. ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌లు భారీ ఇనింగ్స్ ఆడగల సమర్థులు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే పరుగుల ప్రవాహమే. రైనా ఫామ్‌లో ఉన్నాడు. నాలుగో స్థానంలో వస్తున్న రాయుడి పరుగులు చేయడంలో దిబ్బంది పడుతున్నాడు. ఇదొక్కటే చెన్నైని కలవర పెట్టే విషయం. గాయం కారణంగా కేదార్‌ జాదవ్‌ దూరంకానుండడంతో ధ్రువ్‌ షోరే, మురళి విజయ్ జట్టులోకి రావొచ్చు. చివరలో చెలరేగడానికి ధోనీ, బ్రేవో, జడేజాలు ఉన్నారు.

ప్రధాన బలం తాహిర్‌:

ప్రధాన బలం తాహిర్‌:

ఈ సీజన్‌లో చెన్నైకి ప్రధాన బలం స్పిన్నర్‌ తాహిర్‌. ఇప్పటికే 21 వికెట్లు పడగొట్టాడు. పరుగులు నియంత్రిస్తూ కీలక వికెట్లు తీస్తూ చెన్నైకి విజయాలు అందిస్తున్నాడు. అతనికి తోడు జడేజా, హర్భజన్‌లు ఉన్నారు. వీరందరూ రాణిస్తే ముంబై బ్యాటింగ్‌ లైనప్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. పేసర్‌ దీపక్‌ చహర్‌ అంచనాలను నిలబెట్టుకున్నాడు. అతను మరోసారి విజృంభించాలని చెన్నై కోరుకుంటోంది. అతనికి తోడుగా బ్రేవో ఉన్నాడు. మొత్తానికి చెన్నై స్పిన్‌ విభాగంకు తోడు ధోనీ వ్యూహాలు ఫలిస్తే విజయం సులువే.

హార్దిక్‌ను ఆపడం అసాధ్యమే:

హార్దిక్‌ను ఆపడం అసాధ్యమే:

ముంబై ఆడిన చివరి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మన్‌ అదరగొట్టారు. ఓపెనర్ రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌లు అద్భుత ఫామ్ లో ఉన్నారు. ఆ తర్వాత ఎవిన్‌ లూయీస్‌, సూర్యకుమార్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యలతో బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. వీరిని అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు పెను సవాలే. ముఖ్యంగా బ్యాటుతో భీకరంగా విరుచుకుపడుతున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ను ఆపడం అసాధ్యమే. మరి హార్దిక్‌కు ఎవరు అడ్డుకట్ట వేస్తారో చూడాలి. చివరలో చెలరేగడానికి కృనాల్‌ కూడా ఉన్నాడు.

బుమ్రా, మలింగలను ఎదుర్కోవడం కష్టమే:

బుమ్రా, మలింగలను ఎదుర్కోవడం కష్టమే:

ముంబై బౌలింగ్‌ కూడా బాగానే ఉంది. అంతర్జాతీయ ఆటగాళ్లు మెక్లెనగన్‌, బుమ్రా, మలింగలు ముంబైకి ఉండడం కలిసొచ్చే అంశం. బుమ్రా, మలింగలు యార్కర్ల వీరులు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో వీరి బౌలింగ్ ఎదుర్కోవడం చెన్నైకి కష్టమే. పాండ్య సోదరులు, యువ లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌లతో కూడిన పదునైన స్పిన్ బౌలింగ్‌ కూడా ఉంది.

 తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

చెన్నై:

షేన్ వాట్సన్‌, ఫాఫ్ డుప్లెసిస్‌, సురేష్ రైనా, అంబటి రాయుడు, ధ్రువ్‌ షోరే/మురళీ విజయ్, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, డ్వెన్ బ్రావో, దీపక్‌ చాహర్‌, హర్భజన్‌ సింగ్, ఇమ్రాన్ తాహిర్‌.

ముంబయి:

రోహిత్‌ శర్మ, క్వింటన్ డికాక్‌, ఎవిన్‌ లూయీస్‌/ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, మెక్లెనగన్‌, రాహుల్‌ చాహర్‌, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Tuesday, May 7, 2019, 12:22 [IST]
Other articles published on May 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+