Sunrisers Playoff Scenarios: మూడు మ్యాచ్‌లు గెలిచి బరిలో నిలుస్తారా?

హైదరాబాద్: ఐపీఎల్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. టోర్నీలో జట్లన్నీ ఇప్పటికే 11 మ్యాచ్‌లు వరకు ఆడేశాయి. కేవలం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రమే 10 మ్యాచ్‌లు ఆడాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరుకుంటుందా? లేదా అని ఆ జట్టు అభిమానులు చర్చిస్తున్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఇప్పటివరకు పది మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 విజయాలతో పాటు 5 పరాజయాలతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాకౌట్‌కు చేరాలంటే ఇందులో కనీసం మూడు మ్యాచ్‌ల్లో నెగ్గాలి.

రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే
ఇక, రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్రత్యర్థి జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే, ఈ నాలుగు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ రెండింటిలో అయినా గెలుస్తుందా? లేదా అన్నది అనుమానంగా మారింది. అందుకు కారణం వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా సన్‌రైజర్స్ జట్టులోని కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో ఇప్పటికే జట్టుని వీడారు.

సన్‌రైజర్స్ కష్టాలు తప్పేలా లేవు
ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. నిజానికి సన్‌రైజర్స్ బలం బౌలింగే. గతే సీజన్‌లో కూడా 140 లోపు స్వల్ప లక్ష్యాలను కాపాడుకున్న సంగతి తెలిసిందే. భువనేశ్వర్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్ వంటి పేసర్లు, రషీద్ ఖాన్, షకీబ్ వంటి స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్ ఇబ్బంది పడేవారు.

తేలిపోతున్న బౌలర్లు
అయితే, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు తేలిపోతున్నారు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరోవైపు సన్‌రైజర్స్ ఆడనున్న మిగతా నాలుగు మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు దూరమవుతుండటంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ భారాన్ని మనీశ్ పాండే, విజయ్ శంకర్, యూసుఫ్ పఠాన్‌లపై పడుతుంది.

ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే
అయితే, వీరంతా ఈ సీజన్‌లో నిరాశపరుస్తున్నారు. ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే ఏప్రిల్ 27న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఏప్రిల్ 29న పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలో దిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరుగుతుంది కాబట్టి.

ప్రస్తుత పొజిషన్: 4
P -10, W - 5, L - 5, పాయింట్లు: 10
సన్‌రైజర్స్ ఆడే మిగతా మ్యాచ్‌లు:
vs రాజస్థాన్ రాయల్స్ (April 27),
vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (April 29),
vs ముంబై ఇండియన్స్ (May 2),
vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (May 4)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications