Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లేఆఫ్స్‌ రేసులో నాలుగు జట్లు.. సన్‌రైజర్స్‌కే అవకాశం

IPL 2019 : Three Teams To Play It Out For Final Berth || Oneindia Telugu
IPL 2019 Playoff Scenarios: 4 teams in race for the final berth

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)సీజన్-12లో మూడు జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరాయి. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌ చేరగా.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు చేరుకుంది. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇక ప్లేఆఫ్స్‌లో ఒక బెర్తు మాత్రమే ఉంది.

సన్‌రైజర్స్‌కే ఎక్కువ అవకాశాలు:

సన్‌రైజర్స్‌కే ఎక్కువ అవకాశాలు:

ప్లేఆఫ్స్‌లోని ఒక బెర్తు కోసం నాలుగు జట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతున్నాయి. నాలుగు జట్లు పోటీపడుతున్నా.. సన్‌రైజర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సన్‌రైజర్స్‌ 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో ఉంది. ఇంకొక్క మ్యాచ్‌ ఆడాల్సివున్న సన్‌రైజర్స్‌.. ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే అందులో తప్పక నెగ్గాలి. ఒకవేళ సన్‌రైజర్స్‌ గెలిస్తే ప్లేఆఫ్స్‌ చేరినట్టే. కాకపోతే భారీ విజయంతో మ్యాచ్ గెలవాలి.

ఒక జట్టు నిష్క్రమించడం ఖాయం:

ఒక జట్టు నిష్క్రమించడం ఖాయం:

ప్రస్తుతం పంజాబ్, కోల్‌కతాలు 10 పాయింట్లతో ఉన్నాయి. ఈ రెండు జట్లకు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. పంజాబ్ (కోల్‌కతా, చెన్నై), కోల్‌కతా (పంజాబ్, ముంబై)లు మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచినా.. 14 పాయింట్లతో సన్‌రైజర్స్‌తో సమానంగా ఉంటాయి. అపుడు కూడా రన్ రేట్ ఎక్కువగా ఉన్న సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఇక సన్‌రైజర్స్‌ చివరి మ్యాచ్‌లో ఓడిపోతే.. పంజాబ్, కోల్‌కతాలకు ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఈ రోజు పంజాబ్, కలకత్తాలు తలపడనున్నాయి. ఎదో ఒకటి ఓడిపోతుంది కాబట్టి. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమించడం ఖాయం.

ప్లేఆఫ్స్‌ కష్టమే:

ప్లేఆఫ్స్‌ కష్టమే:

రాజస్థాన్ జట్టుకు మాత్రం కొంచెం కష్టమే. అయినా ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ జట్టు తన చివరి మ్యాచ్ ఢిల్లీతో గెలవాలి. ఇదే సమయంలో సన్‌రైజర్స్‌ కచ్చితంగా బెంగళూరుపై ఓడిపోవాలి. మరోవైపు పంజాబ్, కోల్‌కతాలు తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఒకటి ఓడిపోవాలి. ఇవన్నీ జరుగుతే.. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌ చేరుకుంటుంది.

Story first published: Friday, May 3, 2019, 18:40 [IST]
Other articles published on May 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+