For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్‌లో 'ప్లే ఆఫ్‌ మ్యాచ్‌'?

IPL 2019 'Play Of Matches' Will Be In Rajiv Gandhi International Cricket Stadium Hyderabad
IPL-2019 play of matches in Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad

హైదరాబాద్‌ నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్-12లోని ఓ 'ప్లే ఆఫ్‌ మ్యాచ్‌' జరిగే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఈ మేరకు ఈ రోజు జరిగే బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లకు హైదరాబాద్‌తో పాటు చెన్నై కూడా ఆతిధ్యం ఇచ్చే అవకాశం ఉంది. రెండు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు, ఎలిమినేటర్‌ మ్యా చ్‌ ఉంటాయి కాబట్టి ఈ రెండు వేడుకలలో ఒక దాంట్లో రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇదే నిజమయితే హైదరాబాద్ అభిమానులకు పండగే. లీగ్ దశలో హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఆడేటప్పుడు అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోతోంది. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ అంటే ఈ సంఖ్య ఇంకా ఎంత ఉంటుందో మరి. అయితే ఫైనల్ మ్యాచ్ మాత్రం ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుందట.

ఈ రోజు సీఓఏ సమావేశం కానుంది. సీఓఏ సభ్యులతో పాటు బోర్డు అధికారులు సీకే ఖన్నా, అమితాబ్‌ చౌదరి, అనిరుధ్‌ చౌదరిలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సీజన్ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేయడంతో పాటు ఇతర విషయాలపై కూడా చర్చ జరగనుంది. బీసీసీఐ మ్యాచ్‌లకు టైటిల్‌ స్పాన్సర్‌గా పేటీఎం గడువు ముగిసిపోయింది. దీంతో కొత్త స్పాన్సర్‌ కోసం టెండర్లను కోరే అంశం కూడా ఈ చర్చలో రానుంది. మరోవైపు మహిళా క్రికెటర్లతో ఐపీఎల్‌ నిర్వహించడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

Story first published: Monday, April 8, 2019, 10:10 [IST]
Other articles published on Apr 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+