For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరాగ్‌ ఒంటరి పోరాటం.. ఢిల్లీకి స్వల్ప లక్ష్యం

IPL 2019: Parag Half Century, Delhi target is 116

ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. పేసర్ ఇశాంత్ శర్మ వేసిన 2వ ఓవర్ చివరి బంతికి ఓపెనర్ రహానే (2) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇశాంత్ వేసిన 4వ ఓవర్ ఐదో బంతికి లివింగ్‌స్టోన్ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక అక్షర్ వేసిన ఐదో ఓవర్‌లో సంజూ శాంసన్ (5) రనౌట్ అయ్యాడు. దీంతో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్.

1
45929


ఇశాంత్ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టిన లామ్‌రోర్.. ఆ తర్వాతి బంతికి పెవిలియన్ చేరాడు. అమిత్ మిశ్రా వేసిన 12వ ఓవర్‌లో శ్రేయస్ గోపాల్ (12), స్టుపర్ట్ బిన్ని (0) వరుస బంతుల్లో అవుట్ అయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో అర్ధ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌ ఆడి రూథర్‌ఫోర్డ్‌ చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌కి తెరపడింది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా మూడేసి వికెట్లు పడగొట్టాడు.
Story first published: Saturday, May 4, 2019, 18:25 [IST]
Other articles published on May 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+