For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ ఎవరి సొంతం?

IPL 2019: Orange cap, purple cap table after DC vs SRH Eliminator

హైదరాబాద్: విశాఖ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్(గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) ప్లేఆఫ్స్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సన్‌రైజర్స్ నిష్క్రమణ

సన్‌రైజర్స్ నిష్క్రమణ

ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం ఇదే స్టేడియంలో జరగనున్న క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుండగా... ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం పాయింట్ల పట్టిక, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌లను ఎవరు సొంతం చేసుకున్నారో ఒక్కసారి చూద్దాం...

వార్నర్‌దే ఆరెంజ్ క్యాప్

వార్నర్‌దే ఆరెంజ్ క్యాప్

వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సొంతదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లినప్పటికీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఆటగాడిగా అతడే కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ మొత్తం 12 ఇన్నింగ్స్‌లాడి 692 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ (14 ఇన్నింగ్స్‌ల్లో 593) పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

కగిసో రబాడ

కగిసో రబాడ

గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబాడ పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో రబాడ 12 ఇన్నింగ్స్‌ల్లో 25 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి స్థానంలో 23 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రేయాస్ గోపాల్ 20 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, May 9, 2019, 16:54 [IST]
Other articles published on May 9, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+