న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: సన్‌రైజర్స్ కెప్టెన్ అతనే, తేల్చిచెప్పిన లక్ష్మణ్

IPL 2019: No change in Sunrisers Hyderabad leadership despite David Warner’s return, says VVS Laxman

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో కూడా కేన్ విలియమ్సనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తాడని ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇక, వైస్ కెప్టెన్‌గా భువనేశ్వర్‌కుమార్‌ ఉండాటని లక్ష్మన్‌ స్పష్టం చేశారు. గతేడాది బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాదిపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గత సీజన్‌కు దూరమైన డేవిడ్ వార్నర్

గత సీజన్‌కు దూరమైన డేవిడ్ వార్నర్

ఈ నేపథ్యంలో గత సీజన్‌కు డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. అయితే, డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలు అందుకున్న కేన్ విలియమ్సన్ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుని ఫైనల్‌కి చేర్చాడు. అయితే, తిరిగి మళ్లీ వార్నర్ జట్టులో చేరినప్పటికీ... విలియమ్సన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ మొగ్గు చూపింది.

వార్నర్‌ రాక మినహా ఎలాంటి మార్పులు లేవు

వార్నర్‌ రాక మినహా ఎలాంటి మార్పులు లేవు

ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్‌ జట్టులో డేవిడ్ వార్నర్‌ రాక మినహా ఎలాంటి మార్పులు లేవని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఐపీఎల్‌లో ఇదివరకు సన్‌రైజర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్‌ నిషేధం అనంతరం ప్రధాన ఆటగాడిగా కొనసాగుతాడని తెలిపారు. వార్నర్‌ రాకతో సన్‌రైజర్స్‌ జట్టు మరింత బలంగా మారనుందని లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

వార్నర్ గురించి లక్ష్మణ్ మాట్లాడుతూ

వార్నర్ గురించి లక్ష్మణ్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ గురించి లక్ష్మణ్ మాట్లాడుతూ "సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు వార్నర్‌ చేసిన సేవలు ఎంతో గర్వకారణం. అతనెప్పుడూ మా ప్రధాన ఆటగాడుగానే ఉంటాడు. వార్నర్‌పై విధించిన నిషేధం తప్పని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నా.. ఎందుకంటే అతడిని చాలా దగ్గరి నుంచి నేను చూశాను. మళ్లీ సన్‌రైజర్స్‌ జట్టుతో కలిసి సహకరిస్తాడని ఆశిస్తున్నా" అని అన్నారు.

24వ తేదీన కోల్‌కతాతో సన్ రైజర్స్ తొలి మ్యాచ్

మార్చి 23 నుంచి ఐపీఎల్ మొదలవుతుండగా.. 24వ తేదీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా తలపడనుంది. ఇందులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుంది.

Story first published: Friday, March 22, 2019, 17:34 [IST]
Other articles published on Mar 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X