న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను అర్ధ సెంచరీ చేసే సమయంలో తను నిద్రపోయింది: రోహిత్ శర్మ

IPL 2019 : My Daughter Was Sleeping When I Hit My Fifty : Rohit Sharma || Oneindia Telugu
IPL 2019: My daughter was sleeping when I hit my fifty: Rohit Sharma

ఐపీఎల్‌ సీజన్-12 చివరి లీగ్ మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అర్ధ సెంచరీ చేసే సమయంలో తన గారాల పట్టి సమైరా నిద్రపోయిందని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఆదివారం వాంఖెడే మైదానం వేదికగా కోల్‌కతా తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసి కోల్‌కతా టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో అనూహ్యంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరింది.

ఐపీఎల్‌ ఓ ఫన్నీ టోర్నమెంట్:

ఐపీఎల్‌ ఓ ఫన్నీ టోర్నమెంట్:

మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... 'ఇది జట్టు ఫలితం. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఒక్క ఆటగాడిపైనే ఆధారపడలేదు. అందరూ కూడా తమ వంతు కృషి చేసి విజయాలు అందించారు. ఈ రోజు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐపీఎల్‌ బిజినెస్‌ గురించి, దాని విషయాలు తెలుసు. ఫ్రాంచైంజీలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే మనం కష్టపడాల్సి ఉంటుంది. ఐపీఎల్‌ ఓ ఫన్నీ టోర్నమెంట్. ఇందులో ఏ జట్టు దేనినైనా ఓడించవచ్చు. మా ప్రయాణం బాగున్నా మేం మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయి' అని రోహిత్ పేర్కొన్నారు.

కూతురికి అంకితం:

కూతురికి అంకితం:

'ఇక్కడ మ్యాచ్‌ జరిగిన ప్రతిసారీ నా కూతురు సమైరా.. నా ఆటను చూడటానికి వస్తుంది. ఈ రోజు కూడా వచ్చింది. ఆరంభంలో నేను పరుగులు చేయలేదు. కానీ ఈ రోజు అర్ధ శతకం సాధించాను. అయితే ఆలోపే తను నిద్రపోయింది. ఈ అర్ధశతకం తనకి అంకితమిస్తున్నా' అని రోహిత్ తెలిపారు.

కోల్‌కతా ఓటమి:

కోల్‌కతా ఓటమి:

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రాబిన్‌ ఉతప్ప (47 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు)లు ఆదుకున్నారు. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 134 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్‌; 8 ఫోర్లు), సూర్య కుమార్‌ (27 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు చెలరేగారు.

Story first published: Monday, May 6, 2019, 14:15 [IST]
Other articles published on May 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X