డుమినీని విడుదల చేసి థ్యాంక్స్ చెప్తోన్న ముంబై ఇండియన్స్


హైదరాబాద్: మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జేపీ డుమినీని జట్టు నుంచి విడుదల చేసి థ్యాంక్స్ చెప్పింది. అతని సేవలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని కితాబిచ్చింది. గురువారం అన్ని ఫ్రాంచైజీలతో పాటుగా అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన ముంబై ఇండియన్స్ తమ ఫ్రాంచైజీ నుంచి డుమినీని పాట్ కమిన్స్, ముస్తఫిజుర్ రెహమాన్‌లతో పాటుగా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

మిడిల్ ఆర్డర్‌లో చక్కగా రాణిస్తాడనే నమ్మకంతో
2018 జనవరి 27, 28 తేదీలలో జరిగిన ఐపీఎల్ 2018 వేలంలో ముంబై ఇండియన్స్ డుమినీని కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ టోర్నమెంట్‌కి గాను ఆరు సార్లు జట్టు తరపున మైదానంలో ఆడాడు. గత సీజన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన డుమినీ ముంబై ఇండియన్స్‌కు మిడిల్ ఆర్డర్‌లో చక్కగా రాణిస్తాడనే నమ్మకంతో తీసుకుంది.

కేవలం 36పరుగులు మాత్రమే
సదరు జట్టును నిరుత్సాహపరుస్తూ డుమినీ కేవలం 36పరుగులు మాత్రమే తీశాడు. ఈ క్రమంలో అతనిని జట్టు నుంచి విడుదల చేసింది. అనంతరం డుమినీని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ 'నువ్వెప్పుడూ ముంబై ఇండియన్స్ కుటుంబంలో ఒకడివే.' అని పేర్కొంది. డుమినీ తన కెరీర్‌లో 89 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 2029పరుగులు చేశాడు. 2014, 2015 సంవత్సరాలలో అద్భుతంగా రాణించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాళ్లలో డుమినీ ఒకడు.

డేర్‌డెవిల్స్‌కు వరుసగా 410, 414
ఈ రెండు సీజన్లలో డుమినీ 410, 414 వరుసగా పరుగులను చేశాడు. ఒకానొక దశలో డేర్‌డెవిల్స్‌కు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు వహించాడు. కొద్ది రోజుల క్రితం గురువారం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిపి 18 మందితో కూడిన రిటైన్డ్ జాబితాను విడుదల చేసింది. 'ఐపీఎల్ 2019 కంటే ముందుగానే అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు అయిన డుమినీ, కమిన్స్, రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేస్తున్నాం.' అని పేర్కొంది.

జట్టు నుంచి మొత్తం 10మందిని
ఈ 4 అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు మరో 5 అన్ క్యాప్‌డ్ ప్లేయర్లను, ఒక క్యాప్‌డ్ ప్లేయర్లను జట్టు నుంచి మొత్తం 10మందిని విడుదల చేస్తున్నట్లుగా ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications