న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగు టైటిళ్లను నెగ్గిన ముంబై ఇండియన్స్: ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం

IPL 2019 : Social Media Reaction On Mumbai Indians 4th IPL Title || Oneindia Telugu
IPL 2019: Mumbai Indians crowned IPL champions for record fourth time: Twitterati salute Rohit Sharma & Co.

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ ముగింపు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చివరకు అంతిమ విజయం ముంబై ఇండియన్స్‌దే అయింది. ఉప్పల్‌ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. చెన్నై జట్టులో షేన్ వాట్సన్(80) చివరివరకు పోరాడాడు.

ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ తరుణంలో అనూహ్యంగా పుంజుకొన్న ముంబై బౌలర్లు వాట్సన్‌ను రనౌట్‌ చేయడంతో తిరిగి పోటీలోకొచ్చింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీంతో అందరూ సూపర్‌ ఓవర్‌ ఖాయమేనని అనుకున్నారు.

అయితే, చివరి బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ వికెట్‌ తీసి మలింగ మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌ చరిత్రలో నాలుగు టైటిళ్లను నెగ్గిన జట్టుగా ముంబై అరుదైన ఘనత సాధించింది. అంతకమందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 149 పరుగులు చేసింది.

నాలుగో సారి ఐపీఎల్ టైటిల్ నెగ్గడంపై ముంబైపై ట్విట్టర్‌లో ఇలా:

Story first published: Monday, May 13, 2019, 13:57 [IST]
Other articles published on May 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X