న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిటైర్మెంట్‌ గురించి ధోనీ సంకేతాలు ఇవ్వలేదు: సురేశ్‌ రైనా

IPL 2019 : MS Dhoni Will Be Chennai Super Kings Captain As Long As He Wants Says Suresh Raina
IPL 2019: MS Dhoni Will Continue To Be CSK Captain As Long As He Wants Says Suresh Raina

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీకి చెన్నైలో ఎంత క్రేజ్‌ ఉందో మీ అందరికీ తెలిసిందే, అతనెంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడతాడు. రిటైర్మెంట్‌ గురించి ఎలాంటి సమాచారం లేదు అని చెన్నై వైస్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా తెలిపారు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా ధోనీ చెరగని ముద్ర వేసాడు. ఐపీఎల్‌ మొదటి సీజన్ నుండి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడుతూ ఏకంగా మూడు ట్రోఫీలు అందించాడు. ధోనీ సారథ్యంలోని ఆ జట్టు ప్రతీసారి ఆఫ్స్‌కు చేరింది. ఈ సంవత్సరం కూడా ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టు చెన్నైనే.

ప్రపంచకప్‌ అనంతరం రిటైర్మెంట్?:

ప్రపంచకప్‌ అనంతరం రిటైర్మెంట్?:

అయితే ప్రపంచకప్‌ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. అదలావుంటే.. వచ్చే సంవత్సరం ధోనీ 38వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవరిస్తాడా లేదా అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై చెన్నై వైస్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా స్పందించారు.

రిటైర్మెంట్‌ సంకేతాలు ఇవ్వలేదు:

రిటైర్మెంట్‌ సంకేతాలు ఇవ్వలేదు:

'ధోనీ రిటైర్మెంట్‌ గురించి ఎలాంటి సమాచారం లేదు. ధోనీ కూడా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ధోనీకి చెన్నైలో ఎంత క్రేజ్‌ ఉందో మీ అందరికీ తెలిసిందే, అతనెంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడతాడు. చెన్నైకి కెప్టెన్‌గా కూడా ఉంటాడు. అతను ఓ గొప్ప ఆటగాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా ధోనీ సేవలు అద్భుతం' అని రైనా పేర్కొన్నారు.

ధోనీ లేనిలోటు స్పష్టంగా కనిపించింది:

ధోనీ లేనిలోటు స్పష్టంగా కనిపించింది:

'ధోనీ లేనప్పుడు చెన్నై జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టడం సంతోషకరమైన విషయం. టీమిండియా, గుజరాత్‌ లయన్స్‌ జట్లకు కూడా కెప్టెన్‌గా చేశాను. నా సారథ్యంలో మంచి విజయాలు సాధించాం. ధోనీ లేకపోవడం వల్ల చెన్నైకి కెప్టెన్‌గా కన్నా.. ఓ బ్యాట్స్‌మన్‌గా కోల్పోవడమే ఎక్కువ నష్టం. సన్‌రైజర్స్‌, ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే నిరూపితమైంది. ధోనీ లేనిలోటు స్పష్టంగా కనిపించింది. ధోనీ ఆడేటప్పుడు ఇతర ఆటగాళ్లకి స్వేచ్ఛనిస్తాడు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థులకు ఒత్తిడి ఉంటుంది' అని రైనా చెప్పుకొచ్చారు.

Story first published: Saturday, May 4, 2019, 8:00 [IST]
Other articles published on May 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X