
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షిసింగ్ ధోనీపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. చెన్నై జట్టు ఆటగాడు మోను కుమార్ బట్టతలపై ముద్దిస్తూ దిగిన ఫోటోను సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ కాగా.. అభిమానులు మండిపడుతున్నారు.
మంగళవారం రాత్రి చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు సాక్షిహాజరైంది. ఈ సందర్భంగా బట్టతల ఉండే మోను కుమార్ తలపై చెయ్యేసి దిగిన ఫోటోను సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక్కడితో ఆగకుండా.. 'బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది. గడ్డి ఈ పక్కన పచ్చగా లేదు' అని క్యాప్షన్ పెట్టింది. 'బీ పాజిటివ్ ఆల్వేస్' అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ఆమె జత చేసింది.
ఇది చూసిన ధోనీ అభిమానులు కొందరు హర్ట్ కాగా.. మరికొందరు మండిపడుతున్నారు. సాక్షిని అన్ ఫాలో అవుతున్నామంటూ కొందరు కామెంట్లు చేశారు. ఇది ధోనీ చూస్తే.. ఇద్దరికీ హెలికాఫ్టర్ షాటే అని మరొకరు పెట్టారు. 'పిచ్ చాలా ఫ్లాట్ గా ఉంది, బ్యాటింగ్‌కు పనికొస్తుంది'.. 'ఇతను దినేష్ కార్తీకా'.. 'ధోనీ ఇక్కడ చూడు'.. 'మోను అదృష్టవంతుడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.