ఆర్‌ఆర్ vs సీఎస్‌కే: 100వ విజయంకు చేరువలో సీఎస్‌కే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు ఎంత విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ కప్పును ముద్దాడిన చెన్నై.. ఈ సీజన్‌లో కూడా టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. మొత్తం 7 సార్లు ఫైనల్ చేరగా.. మూడు సార్లు టైటిల్ సాధించి.. నాలుగు సార్లు రన్నర్ అప్ గా నిలిచింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

నేడు ఆర్‌ఆర్‌తో సీఎస్‌కే ఢీ:
ఈ సీజన్-12లో సీఎస్‌కే ఇప్పటిరకు ఆడిన మ్యాచులలో ఐదింటిలో విజయం సాధించింది. ఒక్క ముంబై జట్టుతో ఆడిన మ్యాచ్‌లోనే ఓటమిని ఎదుర్కొంది. చెన్నై ప్రస్తుతం 10 పాయింట్లతో పాయింట్ల పట్టిక అగ్రస్థానంలో ఉంది. అయితే గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

సీఎస్‌కే @ 100:
ఈ మ్యాచులో సీఎస్‌కే విజయం సాధిస్తే.. ఐపీఎల్ చరిత్రలో 100 మ్యాచులు గెలిచిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కనుంది. సీఎస్‌కే ఇప్పటివరకు మొత్తం 165 మ్యాచులు ఆడగా.. 99 మ్యాచులలో విజయం సాధించింది.

ధోనీ @ 100:
మరోవైపు ఈ మ్యాచులో సీఎస్‌కే విజయం సాధిస్తే.. 100 మ్యాచులు గెలిచిన జట్టుకి కెప్టెన్‌గా ధోనీ నిలువనున్నాడు. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే ఇప్పటికే 99 మ్యాచులు సాధించింది. ఈ జాబితాలో ధోనీ తర్వాతి స్థానంలో గౌతం గంభీర్ ఉన్నాడు. గౌతం గంభీర్ సారథ్యంలో కోల్‌కతా జట్టు మొత్తం 129 మ్యాచులు ఆడగా.. 71 మ్యాచులు గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications