జీవాతో ధోనీ సందడి.. 'ఆ సముద్రంను చూడు'

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎక్కడ క్రికెట్ మ్యాచ్‌లు ఆడినా.. తన గారాలపట్టి జీవా సందడి చేస్తుంది. మైదానంలో ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే..స్టేడియంలో ఉన్న జీవా 'కమాన్ పప్పా' అని ఎంకరేజ్ చేస్తుంది. ఈ సీజన్‌లో అయితే జీవా అల్లరి మరింత ఎక్కువైంది. మ్యాచ్ అనంతరం తండ్రి ధోనీతో పాటు మైదానంలోకి వచ్చి చెన్నై ఆటగాళ్లతో కబుర్లు కూడా చెప్పింది.
సోషల్ మీడియాలో వైరల్:
ఈ క్రమంలో సీజన్-12 అసాంతం ధోనీతో పాటు కుమార్తె జీవాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ధోనీ-జీవాలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటో క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ధోనీ అభిమానులు ఈ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
చెన్నై ఆటగాళ్ళ ప్రాక్టీస్:
ఈ సీజన్‌లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరినా.. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుపై ఓడిపోయింది. దీంతో ఈ రోజు విశాఖ వేదికగా జరగనున్న క్వాలిఫైయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం బుధవారం సాయంత్రం చెన్నై జట్టు విశాఖకు చేరుకుంది. విశాఖలో ఎండలు మండుతుండటంతో ఇరు జట్లు సాయంత్రం స్టేడియంకు చేరుకుని ప్రాక్టీస్ చేశాయి. తాహిర్, విజయ్, రైనా, రాయుడు, హర్భజన్, డుప్లెసిస్ ఇంకా ఇతర చెన్నై ఆటగాళ్ళు ప్రాక్టీస్ చేశారు.

ఆ సముద్రంను చూడు:
అయితే చెన్నై కెప్టెన్ ధోనీ మాత్రం ప్రాక్టీస్‌కు రాకుండా కూతురు జీవాతో కలిసి హోటల్ గదిలోనే ఉండిపోయాడు. సాగర తీరాన హోటల్ ఉండడంతో.. కిటికీ నుండి సముద్ర అందాలను చూస్తూ కాలక్షేపం చేరారు. 'ఆ సముద్రంను చూడు అంటూ' ధోనీ జీవాతో కబుర్లు చెప్పాడు. దీనికి సంబందించిన ఫొటోను చెన్నై యాజమాన్యం తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications