న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేకేఆర్‌తో ఒప్పందం: రూ.10 కోట్లు కట్టండంటూ దావా వేసిన ఆసీస్ పేసర్

IPL 2019 : Mitchell Starc Files Lawsuit Against Insurers For KKR Contract Payment || Oneindia Telugu
IPL 2019: Mitchell Starc Files Lawsuit Against Insurers for KKR Contract Payment

హైదరాబాద్: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్‌ స్టార్క్‌ లండన్‌కు చెందిన లాయిడ్‌ అనే ఇన్సూరెన్స్ సంస్థపై 1.53 మిలియన్ డాలర్లు (రూ.10 కోట్లు)కు పైగా దావా వేశాడు. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఓ కథనంలో పేర్కొంది. వివరాల్లోకి వెళితే... గతేడాది నిర్వహించిన ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వేలంలో రూ.12.5 కోట్లకు సొంతం చేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో క్రిస్ లిన్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అయితే, గతేడాది సఫారీ గడ్డపై జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మూడో టెస్టులో మిచెల్ స్టార్క్‌కు గాయం కావడంతో ఐపీఎల్ 2018 సీజన్ మొత్తానికి మిచెల్ స్టార్క్ దూరమైన సంగతి తెలిసిందే.

ఇదే సిరిస్‌లో బాల్ టాంపరింగ్

ఇదే సిరిస్‌లో బాల్ టాంపరింగ్

మరోవైపు ఇదే సిరిస్‌లో బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు సైతం గత సీజన్ ఐపీఎల్‌కు దూరమయ్యారు. అయితే గాయం లేదా మరే ఇతర కారణాలతో ఐపీఎల్‌ ఆడని పక్షంలో తనకు ఇన్సూరెన్స్ చెల్లించేలా అతను లాయిడ్‌ సంస్థతో మిచెల్ స్టార్క్ ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా అతడు ఆ సంస్థకు రూ.68 లక్షల దాకా ప్రీమియం చెల్లించాడు.

ఐపీఎల్ వేలం ముగిసిన వెంటనే

ఐపీఎల్ వేలం ముగిసిన వెంటనే

గత ఐపీఎల్ వేలం ముగిసిన వెంటనే స్టార్క్ లాయిడ్‌ సంస్థ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఈ సంస్థ సంప్రదాయ ఇన్సూరెన్స్ సంస్థలు ఇవ్వని భిన్నమైన పాలసీలు ఇస్తుంది. అయితే, గాయం కారణంగా తాను ఐపీఎల్‌కు దూరమైనప్పటికీ... లాయిడ్‌ సంస్థ తనకు ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో స్టార్క్ తరుపు న్యాయవాదులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం వరల్డ్‌కప్ ప్రిపరేషన్‌లో

ప్రస్తుతం వరల్డ్‌కప్ ప్రిపరేషన్‌లో

ఈ క్రమంలో మిచెల్ స్టార్క్ తనకు 1.5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10.39 కోట్లు) చెల్లించాలని దావా వేశాడు. గాయం నుంచి కోలుకున్న మిచెల్ స్టార్క్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు.

Story first published: Wednesday, April 10, 2019, 15:25 [IST]
Other articles published on Apr 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X