Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబైతో సన్‌రైజర్స్‌ ఢీ.. వార్నర్‌ లేకుండా బరిలోకి

IPL 2019 : Warner-Less SRH Takes On MI In A Virtual Must-Win | Oneindia Telugu
IPL 2019, MI vs SRH Preview: Can Mumbai take advantage of Warners absence?

లీగ్‌ మ్యాచ్‌లు దాదాపు అంతిమ దశకు చేరుకున్నాయి. చెన్నై, ఢిల్లీ జట్లు అధికారికంగా ప్లే ఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ముంబై, హైదరాబాద్, కలకత్తా, పంజాబ్ జట్లు పోటీ పడుతున్నా.. ముంబై, హైదరాబాద్ జట్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి.

సన్‌రైజర్స్‌ తప్పక గెలవాలి:

సన్‌రైజర్స్‌ తప్పక గెలవాలి:

ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై 16 పాయింట్లతో.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ఒకవేళ హైదరాబాద్‌ గెలిస్తే.. 14 పాయింట్లతో ముంబై, హైదరాబాద్‌ సమంగా ఉంటాయి. అయితే ముంబై కంటే ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కే చాలా ముఖ్యం. ఎందుకంటే ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాలి. ఒకవేళ సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే.. తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు కోల్‌కతా, పంజాబ్‌ జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ తప్పక గెలవాలి.

వార్నర్‌ లేకుండానే బరిలోకి:

వార్నర్‌ లేకుండానే బరిలోకి:

లీగ్‌లో ఇప్పటివరకు సన్‌రైజర్స్‌ విజయాల్లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు కీలక పాత్ర పోషించారు. ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో మొదటగా బెయిర్‌స్టో స్వదేశానికి వెళ్లగా.. తాజాగా వార్నర్ కూడా జట్టును వీడాడు. వార్నర్ చివరి మ్యాచ్‌లో చెలరేగి ఆడి చక్కటి విజయాన్ని అందించి వెళ్ళిపోయాడు. దీంతో సన్ రైజర్స్ ఈ వార్నర్‌ లేకుండానే బరిలో దిగనుంది. కీలక మ్యాచ్ సమయంలో వార్నర్‌ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు.

వార్నర్‌ స్థానంలో

వార్నర్‌ స్థానంలో

వార్నర్‌ స్థానంలో వస్తున్న మార్టిన్‌ గప్టిల్‌ పరుగుల వరద పారించాల్సిన అవసరం ఉంది. ఇక మనీశ్‌ పాండే ఫామ్ అందుకున్నాడు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. విజయ్‌ శంకర్‌, పఠాన్, సాహా రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో భువనేశ్వర్, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్, నబీలు రాణించడం కలిసొచ్చే అంశం.

ఒక్క విజయం:

ఒక్క విజయం:

లీగ్‌ ప్రారంభంలో తడబడిన ముంబై అనంతరం పుంజుకుని ప్లే ఆఫ్‌ రేసులో నిలిచింది. ప్రస్తుతం ప్లే ఆఫ్‌ బెర్తుకు ఒక విజయం దూరంలోనే ఉండటంతో.. ఈ మ్యాచ్‌లోనే దాన్ని సాధించాలని చూస్తోంది. ఓపెనింగ్‌లో రోహిత్‌, డికాక్‌లు మంచి ఆరంభమే ఇస్తున్నారు. అనంతరం సూర్యకుమార్, లెవీస్ జట్టును ఆదుకుంటున్నారు. ఇక హర్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌ విధ్వంసక ఆటతో విజయాల్ని అందిస్తున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, మలింగ, చాహర్ అదరగొడుతున్నారు. రెండు విభాగాల్లో పటిష్టంగా ఉన్న ముంబైని ఓడించాలంటే సన్‌రైజర్స్‌ మంచి ప్రదర్శనే చేయాలి. మరోవైపు వార్నర్ లేని అవకాశాన్ని ముంబై ఉపయోగించుకుంటే విజయం సులువే.

Story first published: Thursday, May 2, 2019, 16:35 [IST]
Other articles published on May 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+