Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌కు చావో రేవో!: టాస్ నెగ్గిన ముంబై, వార్నర్ లేకుండానే!

IPL 2019: MI vs SRH: Live Score: Mumbai Indians win the toss and elect to bat

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పలు మార్పులతో బరిలోకి దిగుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆసీస్‌కు వెళ్లిన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ మార్టిన్ గుప్టిల్‌ని, సందీప్ శర్మ స్థానంలో బసిల్ థంపిని తుది జట్టులోకి తీసుకుంది. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తుంది. పాయింట్ల పట్టికలో ముంబై, హైదరాబాద్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు ఎంతో కీలకం.

ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల తలపడటం ఇది రెండోసారి. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, చివరగా ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ చావో రేవో లాంటింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకుంటుంది.

ఈ సీజన్‌లో ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోలు వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత దేశాలకు వెళ్లారు. దీంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎలా ఆడుతుందనే ఆసక్తి ఉంది. సొంత ప్రేక్షకుల మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో ముంబై ఇండియన్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

1
45927

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్, ఎవిన్ లూయిస్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బరీందర్ శ్రణ్, రాహుల్ చహార్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా

సన్‌రైజర్స్ హైదరాబాద్
మార్టిన్ గుప్టిల్, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బసిల్ థంపి

Story first published: Thursday, May 2, 2019, 22:02 [IST]
Other articles published on May 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+