న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019: MI vs SRH: సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 163

SRH

హైదరాబాద్: వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ క్వింటన్ డీకాక్ 58 బంతుల్లో 69(6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 163 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో ముంబైకి ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే, జట్టు స్కోరు 36 పరుగుల వద్ద ఖలీల్ అహ్మద్ వేసిన 6వ ఓవర్ రెండో బంతికి రోహిత్ శర్మ(24) నబీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఖలీల్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి సూర్యకుమార్(23) రషీద్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

దీంతో 90 పరుగులకు ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవిన్ లూయిస్(1) విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ సీజన్‌లో గత మ్యాచ్‌ల్లో ముంబై తరుపున అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యా(18) ఈ మ్యాచ్‌లో అభిమానులను నిరాశ పరిచాడు.

జట్టు స్కోరు 119 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు ఓపెనర్ డీకాక్ 58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 69 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు, నబీ, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై
అంతకముందు వాంఖడె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆసీస్‌కు వెళ్లిన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ మార్టిన్ గుప్టిల్‌ని, సందీప్ శర్మ స్థానంలో బసిల్ థంపిని తుది జట్టులోకి తీసుకుంది.

1
45927

ముంబై గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తుంది. పాయింట్ల పట్టికలో ముంబై, హైదరాబాద్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు ఎంతో కీలకం.

ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల తలపడటం ఇది రెండోసారి. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, చివరగా ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ చావో రేవో లాంటింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకుంటుంది.



ఈ సీజన్‌లో ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోలు వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత దేశాలకు వెళ్లారు. దీంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎలా ఆడుతుందనే ఆసక్తి ఉంది. సొంత ప్రేక్షకుల మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో ముంబై ఇండియన్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్, ఎవిన్ లూయిస్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బరీందర్ శ్రణ్, రాహుల్ చహార్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా

సన్‌రైజర్స్ హైదరాబాద్
మార్టిన్ గుప్టిల్, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బసిల్ థంపి

Story first published: Thursday, May 2, 2019, 22:23 [IST]
Other articles published on May 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X