For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాంఖడెలో MI vs SRH: హెడ్ టు హడ్ రికార్డులివే

IPL 2019 : Mumbai Indians Vs Sunrisers Hyderabad Match Preview || Oneindia Telugu
 IPL 2019: MI vs SRH - Ground stats, head-to-head record, key players and probable XI

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిత్యమిస్తోంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల తలపడటం ఇది రెండోసారి. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌ ఆరంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని అద్భుతమైన ప్రదర్శనలు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే, చివరగా ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

అయితే, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా 34 బంతుల్లో 91 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసినా జట్టుని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సొంత ప్రేక్షకుల మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.

ఇక, సన్‌రైజర్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ చావో రేవో లాంటింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకుంటుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోలు వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత దేశాలకు వెళ్లారు. దీంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎలా ఆడుతుందనే ఆసక్తి ఉంది.

మ్యాచ్ విశేషాలు

మ్యాచ్ విశేషాలు

తేదీ: Thursday, 2 May 2019

సమయం: 08:00 PM IST

వేదిక: Wankhede Stadium, Mumbai

లైవ్ టెలికాస్ట్: Star Network

ఆన్‌లైన్ స్ట్రీమింగ్: Hotstar

వాంఖడె గణాంకాలు

వాంఖడె గణాంకాలు

మొత్తం మ్యాచ్‌లు - 70

Matches won batting first - 35

Matches won bowling first - 35

Average 1st Inns scores - 166

Average 2nd Inns scores - 154

హెడ్ టు హెడ్ రికార్డు

హెడ్ టు హెడ్ రికార్డు

Total - 13

MI- 6

SRH - 7

వాంఖడెలో హెడ్ టు హెడ్ రికార్డు

Total - 4

MI - 3

SRH - 1

కీలక ఆటగాళ్లు

కీలక ఆటగాళ్లు

ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ

హార్దిక్ పాండ్యా

లసిత్ మలింగ

సన్‌రైజర్స్ హైదరాబాద్

మనీష్ పాండే

రషీద్ ఖాన్

భువనేశ్వర్ కుమార్

జట్ల వివరాలు

జట్ల వివరాలు

ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్, ఎవిన్ లూయిస్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బరీందర్ శ్రణ్, రాహుల్ చహార్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా

సన్‌రైజర్స్ హైదరాబాద్

మార్టిన్ గుప్టిల్, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, దీపక్ హుడా, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ

Story first published: Thursday, May 2, 2019, 16:20 [IST]
Other articles published on May 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+