Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs RR: వాంఖడెలో టాస్ నెగ్గిన రాజస్థాన్, ముంబై బ్యాటింగ్

IPL 2019, MI vs RR IPL Score: Rajasthan Royals win the toss and elect to field

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గాయంతో బాధపడుతున్న బెన్ స్టోక్స్ స్థానంలో లివింగ్ స్టోన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా... కృష్ణప్ప గౌతం కూడా తిరిగి జట్టులో చేరాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమిపాలై పాయింట్ల పట్టకలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కి ముంబై ఇండియన్స్‌కు మద్దతు తెలిపేందుకు గాను 21వేల మంది చిన్నారులు స్టేడియానికి వచ్చారు. ప్రతి సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ ఐపీఎల్‌లో సొంతగడ్డపై జరిగే ఓ మ్యాచ్‌కి చిన్నారులతో కలిసి స్టేడియానికి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కి ముందు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

"చదువు, క్రీడలు ఈ రెండింటి భాగస్వామ్యం పిల్లలను విజయవంతమైన భవిష్యత్తు వైపుకు నడిపిస్తాయి. ఈఎస్ఏ ముంబై ఇండియన్స్‌ను స్పాన్సర్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఏప్రిల్ 13న జరిగే మ్యాచ్‌లో 21వేల మంది చిన్నారులు వస్తున్నారు. వాళ్ల చిరునవ్వులను చూసేందుకు ఎదురుచూస్తున్నా" అని రోహిత్ ట్వీట్ చేశాడు.

జట్ల వివరాలు
ముంబై ఇండియన్స్

క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, రాహుల్ చాహర్, అల్జారి జోసెఫ్, జస్ప్రీత్ బుమ్రా

రాజస్థాన్ రాయల్స్
అజ్యింకె రహానే(కెప్టెన్), జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, లియాం లివింగ్ స్టోన్, కృష్ణప్ప గౌతమ్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కత్, ధావల్ కులకర్ణి

Story first published: Saturday, April 13, 2019, 16:05 [IST]
Other articles published on Apr 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+