
హైదరాబాద్: వాంఖడె వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు క్వింటన్ డీకాక్ 52 బంతుల్లో 81(6 ఫోర్లు, 4 సిక్సులు), రోహిత్ శర్మ 32 బంతుల్లో 47 (6 ఫోర్లు, సిక్స్)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్‌కి 188 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కి ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. మ్యాచ్ ఆరంభం నుంచీ వీరిద్దరూ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. జోఫ్రా ఆర్చర్ వేసిన 11వ ఓవర్ ఐదో బంతికి రోహిత్ శర్మ(47) బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్(16), కీరణ్‌పోలార్డ్ (6) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
చివర్లో హార్ధిక్ పాండ్యా 11 బంతుల్లో 28(ఫోర్, 3 సిక్సులు) దూకుడుగా ఆడటంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, కులకర్ణి, ఉనద్కట్ చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా గత మ్యాచ్‌కి దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఈ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నాడు.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గాయంతో బాధపడుతున్న బెన్ స్టోక్స్ స్థానంలో లివింగ్ స్టోన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా... కృష్ణప్ప గౌతం కూడా తిరిగి జట్టులో చేరాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమిపాలై పాయింట్ల పట్టకలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కి ముంబై ఇండియన్స్‌కు మద్దతు తెలిపేందుకు గాను 21వేల మంది చిన్నారులు స్టేడియానికి వచ్చారు. ప్రతి సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ ఐపీఎల్‌లో సొంతగడ్డపై జరిగే ఓ మ్యాచ్‌కి చిన్నారులతో కలిసి స్టేడియానికి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కి ముందు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
"చదువు.. క్రీడలు రెండింటి మధ్య పార్టనర్‌షిప్ పిల్లలను సక్సెస్‌ఫుల్ ఫ్యూచర్ వైపుకు నడిపిస్తాయి. ఈఎస్ఏ ముంబై ఇండియన్స్‌ను స్పాన్సర్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఏప్రిల్ 13న జరిగే మ్యాచ్‌లో 21వేల మంది చిన్నారులు వస్తున్నారు. వాళ్ల చిరునవ్వులను చూసేందుకు ఎదురుచూస్తున్నా" అని రోహిత్ ట్వీట్ చేశాడు.
జట్ల వివరాలు
ముంబై ఇండియన్స్
క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, రాహుల్ చాహర్, అల్జారి జోసెఫ్, జస్ప్రీత్ బుమ్రా
రాజస్థాన్ రాయల్స్
అజ్యింకె రహానే(కెప్టెన్), జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, లియాం లివింగ్ స్టోన్, కృష్ణప్ప గౌతమ్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కత్, ధావల్ కులకర్ణి