Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI Vs RCB: టాస్ నెగ్గిన ముంబై, ఆర్సీబీ బ్యాటింగ్

IPL 2019: MI Vs RCB, Live Updates: Mumbai Indians have won the toss and have opted to field

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గాయపడిన అల్జారి స్థానంలో లసిత్ మలింగ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన ముంబై నాలుగింట విజయం సాధించి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒకదానిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. వరుసగా ఆరు ఓటముల పాలైన కోహ్లీసేన ఏడో మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడింది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.

1
45907

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్

క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్ర్పీత్ బుమ్రా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పార్దీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మార్కస్ స్టోయినిస్, మొయిన్ అలీ, అక్షదీప్ నాథ్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, నవదీప్ షైనీ, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్

Story first published: Monday, April 15, 2019, 19:53 [IST]
Other articles published on Apr 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+