Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో తొలిసారి: ముంబై కెప్టెన్‌గా పొలార్డ్ అరుదైన ఘనత

IPL 2019, MI vs KXIP Live Score: Mumbai Indians win the toss and field

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అతడి స్థానంలో కెప్టెన్‌గా వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో కీరన్ పొలార్డ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే కీరన్ పొలార్డ్ తొలిసారి ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తరుపున యువ ఆటగాడు సిద్ధార్ద్ లాడ్ అరంగేట్రం చేస్తున్నాడు. మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న క్రమంలో రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే.

ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసే క్రమంలో డైవ్ చేయగా అతని కుడి తొడ కండరాలకు గాయమైంది. మరోవైపు పంజాబ్ కెప్టెన్ అశ్విన్ కూడా తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. మయాంక్ అగర్వాల్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానంలో కరుణ్ నాయర్, విజియిన్‌లకు తుది జట్టులో చోటు కల్పించాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన పంజాబ్ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి ఐదో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడంతో ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వెస్టిండిస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ (12/6) ఆరంభ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మరోవైపు పంజాబ్ విషయానికి వస్తే మొహాలి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా సాగనుంది.

1
45900


జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్
క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, బెహ్రాన్ డార్ఫ్, రాహుల్ చాహర్, అల్జారి జోసెఫ్‌, జస్ప్రీత్ బుమ్రా, సిద్ధార్ద్ లాడ్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్‌దీప్ సింగ్, శామ్ కర్రన్, రవిచంద్రన్ అశ్విన్, విజియిన్, అంకిత్ రాజ్ పుత్, మహ్మద్ షమీ

Story first published: Wednesday, April 10, 2019, 19:55 [IST]
Other articles published on Apr 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+