న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేకేఆర్ ఓటమికి కారణం అతడి జిడ్డు బ్యాటింగే!: ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

IPL 2019 : Robin Uthappa Trolled For Slow Batting || Oneindia Telugu
IPL 2019, MI vs KKR - ‘Pathetic batting’: Twitter slams Robin Uthappa after meek show

హైదరాబాద్: వాంఖడె వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఐపీఎల్ 12వ సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధిస్తే వేరే జట్లతో పోటీ లేకుండా ప్లేఆఫ్స్‌‌కు అర్హత సాధించేది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కోల్‌కతా ఓటమి

కోల్‌కతా ఓటమి

అయితే, కోల్‌కతా ఓటమితో మెరుగైన రన్ రేట్‌ని కలిగి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే మ్యాచ్ కావడంతో కోల్‌కతా ఎలా ఆడుతుందా? అని ప్రతి ఒక్క కేకేఆర్ అభిమాని ఎంతో ఆశగా ఎదురు చూశాడు. అయితే, కోల్‌కతా మాత్రం తన పేలవ ఆటతో ఆశ్చర్యపరిచింది.

కోల్‌కతా అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలం

కోల్‌కతా అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలం

కనీస ప్రయత్నం కూడా చేయకుండా ఓడిపోయింది. ఈ సీజన్ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడిన కోల్‌కతా అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా రాబిన్ ఊతప్ప కారణంగానే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిపోయిందంటూ ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ప్లేఆఫ్‌ చేరాలంటే

ప్లేఆఫ్‌ చేరాలంటే

కోల్‌కతా తన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్లో 0.. 12వ ఓవర్లో 4.. 16వ ఓవర్లో 6.. 19వ ఓవర్లో 7.. 20వ ఓవర్లో 3 పరుగులు చేసింది. ప్లేఆఫ్‌ చేరాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ ఆడిన తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. రాబిన్‌ ఉతప్ప 47 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 40 పరుగులు చేసి ఆ జట్టు ఓటమికి కారణమయ్యాడు.

ఊతప్పపై నెటిజన్లు తీవ్ర విమర్శలు

ఊతప్పపై నెటిజన్లు తీవ్ర విమర్శలు

దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు ఈ సీజన్‌లో ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆండ్రీ రస్సెల్ (0) డకౌట్ కావడం కేకేఆర్‌ను దెబ్బతీసింది. మ్యాచ్ ఆరంభంలో నైట్‌రైడర్స్‌ 3 ఓవర్లకు 10 పరుగులే చేసినప్పటికీ, ఓపెన్ క్రిస్‌ లిన్‌ రాణించడంతో ఈ మాత్రం స్కోరన్నా చేయగలిగింది.

Story first published: Monday, May 6, 2019, 14:41 [IST]
Other articles published on May 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X