
హైదరాబాద్: వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్రిస్ లిన్ 29 బంతుల్లో 41(2 ఫోర్లు, 4 సిక్సులు), రాబిన్ ఊతప్ప 47 బంతుల్లో 40(ఫోర్, 3 సిక్సులు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు 134 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
వాంఖడె స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఆ జట్టు తరుపున ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఎవిన్ లూయిస్, బరీందర్ శ్రాన్‌ల స్థానంలో ఇశాన్ కిషన్, మిషెల్ మెక్లన్‌గన్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే కోల్‌కతాకు ప్లేఆఫ్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ముంబై గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకుతుంది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, ముంబై జట్లు ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరగా.. చివరి స్థానం ఎవరిదో ఆదివారం నాటి మ్యాచ్‌లతో తేలనుంది. ఇక చివరి ప్లేఆఫ్స్ బెర్తు కోసం కోల్‌కతా, హైదరాబాద్, పంజాబ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో సన్‌రైజర్స్ మ్యాచ్ ప్లేఆఫ్‌కు చేరుతుందా లేదా అన్నది ముంబై-కోల్‌కతా మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఉంటుంది. ముంబైతో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా ఓడితేనే హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ముంబైపై కోల్‌కతా గెలిస్తే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
మెరుగైన రన్‌రేట్ (+0.577) ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే బెంగళూరు, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. కాగా, ప్లేఆఫ్స్ చేరిన మూడు జట్లకు, చివరి బెర్తుకు పోటీలో ఉన్న మూడు జట్లకు ఆదివారం నాటి మ్యాచ్ ఫలితాలు కీలకం కానున్నాయి.
జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:
క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, ఇశాన్ కిషన్, మిషెల్ మెక్లన్‌గన్
కోల్‌కతా నైట్‌రైడర్స్
క్రిస్ లిన్, రాబిన్ ఊతప్ప, కార్లోస్ బ్రాత్ వైట్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్, శుభమాన్ గిల్, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరేన్, సందీప్ వారియర్, ప్రసిద్ధ్ కృష్ణ