
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ఢిల్లీ జట్టు నిరాశపరచగా.. ముంబయి ఇండియన్స్ కూడా లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో కనీసం ఈ ఏడాదైనా మెరుగ్గా ఆడాలని ఇరుజట్లూ కోరుకుంటున్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరుని ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకోవడంతో పాటు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది.
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఇప్పటివరకు ముగిసిన పదకొండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మూడేసి సార్లు టైటిల్ గెలిచాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు, రాజస్థాన్ రాయల్స్ , డక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి.