Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2019: భారత్-పాక్ మ్యాచ్‌లా!, యువీతో భజ్జీ అలింగనం (వీడియో)

IPL 2019: MI vs CSK like India vs Pakistan, says Harbhajan Singh

హైదరాబాద్: ఐపీఎల్‌లో మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టోర్నీలో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓటమెరగని సీఎస్‌కేని సొంతగడ్డపై ఓడించాలని ముంబై ఇండియన్స్ గట్టి పట్టుదలతో ఉంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

భారత్-పాక్ మ్యాచ్‌ మాదిరి

ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా అది భారత్-పాక్ మ్యాచ్‌లాగే ఉంటుందని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఐపీఎల్‌లో పది సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు హర్భజన్ సింగ్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై-చెన్నై మ్యాచ్‌పై భజ్జీ స్పందించాడు.

చెన్నైని ఓడించాలని అనుకునేవాళ్లం

"ముంబై తరఫున ఆడే సమయంలో చెన్నైని ఓడించాలని అనుకునేవాళ్లం. చెన్నై కూడా ముంబై గెలవడానికి ప్రయత్నించేది. కానీ ఇప్పుడు చెన్నై టీమ్ తరఫున ఆడుతూ.. ముంబైని ఓడించాలని అనుకోవడం వింతగా ఉంది" అని హర్భజన్ సింగ్ చెప్పాడు. 2017 సీజన్ ముగిసిన తర్వాత భజ్జీని ముంబై ప్రాంఛైజీ వేలానికి వదిలేసింది.

రూ.2 కోట్లకు భజ్జీని కొన్న చెన్నై

దీంతో 2018 వేలంలో కనీస ధర రూ.2 కోట్లకు హర్భజన్ సింగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. చెన్నై జట్టులో వెటరన్ క్రికెటర్లు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఆ జట్టు అద్భుతమైన విజయాలను నమోదు చేస్తోంది. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టిలో అగ్రస్థానంలో ఉంది.

చెన్నై జట్టుకు డాడీస్ ఆర్మీ అని పేరు

చెన్నై జట్టుకు డాడీస్ ఆర్మీ అని పేరు

ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు డాడీస్ ఆర్మీ అని కూడా పేరుంది. అందుకు కారణం సగానికి పైగా ఆటగాళ్లు 30 ఏళ్లకు పైబడి ఉండటమే. ఇక, ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడగా... అందులో 13సార్లు ముంబై, 11 సార్లు చెన్నై విజయం సాధించింది. కాగా, చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు ముంబై గెలవడం విశేషం.

Story first published: Wednesday, April 3, 2019, 18:29 [IST]
Other articles published on Apr 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+