12 సీజన్లలోనూ 300కుపైగా పరుగులు: సురేశ్ రైనా ఆల్‌టైమ్ రికార్డు

హైదరాబాద్: చెపాక్ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 31 బంతుల్లో44(4ఫోర్లు, 1 సిక్సర్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ధావన్(19) పరుగులతో ఫరవాలేదనిపించాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ నాలుగు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా... భజ్జీ, చాహర్ చెరో వికెట్ తీశారు.
అంతకముందు సురేశ్ రైనా 37 బంతుల్లో 59(8 ఫోర్లు, సిక్స్), ధోని 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
CSK vs DC మ్యాచ్ హైలెట్స్ ఇవే:

చెపాక్‌లో ఢిల్లీకి ఆరో ఓటమి
6 - చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం విశేషం. 2008, 2010లో సీజన్లలో ఈ వేదికలో ఆడిన మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఢిల్లీ.... ఆ తర్వాత 2011 నుంచి చెపాక్ వేదికగా జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ ఓడిపోయింది.
80 - ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో సీఎస్‌కేకి ఇది ఆరో అతిపెద్ద విజయం. చెన్నై సాధించిన నాలుగు పెద్ద విజయాలు ఢిల్లీపైనే కావడం విశేషం.

రోహిత్ రికార్డు సమం చేసిన ధోని
17 - ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్, మెరుపు స్టంపింగ్‌లతో ధోనీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' దక్కింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోనీ ఖాతాలో 17వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు చేరింది. 17 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులతో టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును ధోనీ సమం చేసాడు. ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి వీరిద్దరు మాత్రమే అత్యధికంగా అవార్డులను గెలిచారు.
100 - ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా సురేశ్ రైనా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీ షా క్యాచ్ అందుకోవడంతో సురేశ్ రైనా ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో మరే ఆటగాడు ఇన్ని క్యాచులు అందుకోలేదు. రైనా తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ 84, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ 82 క్యాచ్‌లు అందుకున్నారు.

సురేశ్ రైనా ఏకైక రికార్డు
50 - ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా 59 పరుగులు చేయడంతో టీ20ల్లో 50 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లు జాబితాలో చేరాడు. టీ20ల్లో 50 హాఫ్ సెంచరీలు సాధించిన ఐదో ఆటగాడు సురేశ్ రైనా.
1 - ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా 59 పరుగులు చేయడంతో ఈ సీజన్‌లో సురేశ్ రైనా 300 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ 12 సీజన్లలో 300కుపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు సురేశ్ రైనానే. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 11 సీజన్లలో 300కుపైగా పరుగులు చేశాడు. ఒక్క 2018 సీజన్‌లో మాత్రం రోహిత్ శర్మ 300 పరుగులు చేయలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications