Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిరోజ్ షా కోట్లాలో DC vs CSK: సూపర్ ఫామ్‌లో ఉన్న పంత్‌ని ధోని నిలువరిస్తాడా?

IPL 2019 : The Trending 'MS Dhoni vs Rishabh Pant' Debate Will Gain Heat
 IPL 2019: Match 5, DC vs CSK Predicted Playing 11, Match Preview & Head to Head Records

హైదరాబాద్: ఐపీఎల్‌ 2019 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోటీకి మంగళవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై బౌలర్లని వారి సొంతగడ్డపైనే చితకబాదిన రిషబ్ పంత్ (78 నాటౌట్) సూపర్ ఫామ్‌లో ఉండటంతో చెన్నై కెప్టెన్ ధోని తన వ్యూహాలతో అతడ్ని మ్యాచ్‌లో ఎలా నిలువరిస్తాడో? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సొంతగడ్డపై ఢిల్లీకిదే తొలి మ్యాచ్‌. ఐపీఎల్ 2019 సీజన్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ 12 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9), జడేజా (2/15) రాణించడంతో ఆ జట్టుని 17.1 ఓవర్లలో కేవలం 70 పరుగులకే ఆలౌట్ చేసింది.

అదే జోరుని కొనసాగించాలని చెన్నై సూపర్ కింగ్స్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో సొంతగడ్డపై ఢిల్లీ కూడా అదే జోరుని చెన్నైపై కొనసాగించాలని ఆశిస్తోంది.

రాత్రి 8 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

Story first published: Tuesday, March 26, 2019, 17:45 [IST]
Other articles published on Mar 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+