RCB vs RR: ఆర్సీబీపై గెలిచి ప్లేఆఫ్ బరిలో రాజస్థాన్ నిలిచేనా?

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడుతున్నాయి. చివరగా ఈ రెండు జట్లు ఆడిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాజస్థాన్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.... ఆర్సీబీ మాత్రం 8 పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. టెక్నికల్‌గా చెప్పాలంటే ఆర్సీబీ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు దూరమైనట్టే. అయితే, మిగతా జట్ల ఓటములు ఆర్సీబీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్ ఆర్సీబీకి ఎంతమాత్రం కలిసి రాలేదు.

వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన ఆర్సీబీ
సీజన్ ఆరంభంలో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అంతేకాదు ఐపీఎల్‌లో 100 ఓటములను ఎదుర్కొన్న తొలి జట్టుగా ఆర్సీబీ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆర్సీబీ పరువు దక్కించుకోవాలని చూస్తుండగా... రాజస్థాన్ మాత్రం గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలవాలని చూస్తోంది.

ఆర్సీబీ కీలక ఆటగాళ్లు వీరే
ఆర్సీబీలో కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్. అయితే, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. బ్యాట్స్‌మెన్‌గా కూడా అతడి ఆట అభిమానులను నిరాశపరుస్తోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, డివిలియర్స్ విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఆర్సీబీ ప్రధాన బౌలర్‌గా కొనసాగుతున్న చాహల్ సైతం ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 వికెట్లు మాత్రమే తీశాడు. 8కి పైగా ఎకానమీతో పరుగులు ధారాళంగా సమర్పించుకున్న సందర్భాలు అనేకం.

రాజస్థాన్‌లో కీలక ఆటగాళ్లు వీరే
ఈ సీజన్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహారించాడు. అయితే, స్టీవ్ స్మిత్‌కు ఎప్పుడైతే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారో ఆ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ యావరేజి 44.3 కాగా, స్ట్రయిక్ రేట్ 130గా ఉంది. ఈ సీజన్‌లో స్టీవ్ స్మిత్‌కు బహుశా ఇదే ఆఖరి మ్యాచ్ కావొచ్చు. ఈ మ్యాచ్ అనంతరం వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. మరోవైపు ఈ సీజన్ మాత్రం శ్రేయాస్ గోపాల్‌కు డ్రీమ్ సీజన్.

నేటి మ్యాచ్‌లో విజయమెవరిది?
ఈ సీజన్‌లో ఇరు జట్లు నిలకడలేమి ప్రదర్శనను కొనసాగించాయి. అయితే, ఆర్సీబీతో పోలిస్తే రాజస్థాన్ కొంత మేరకు ఫరవాలేదు. ఆర్సీబీ సొంత గడ్డపై ఈ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల మద్దతు ఆ జట్టుకే ఉంటుంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ విజయాలు సాధించింది. ఈ ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్ బరిలోకి దిగనుంది. రాజస్థాన్ లేదా ఆర్సీబీ ఏ జట్టు గెలిచినా... ప్లేఆఫ్ అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications