IPL 2019: Match 48: రషీద్ ఖాన్ 50, ముజీబ్ ఖాతాలో ఓ చెత్త రికార్డు

హైదరాబాద్: ప్లేఆఫ్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
హైదరాబాద్ నిర్దేశించిన 213 లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. 213 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విఫలమైంది. పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్ (79) హాఫ్ సెంచరీతో రాణించగా... గేల్(4), మయాంక్(27), పూరన్ (21), మిల్లర్ (11) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు.
సన్‌రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రషిద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీయగా, సందీప్ శర్మ రెండు వికెట్లు తీశారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
SRH vs KXIP మ్యాచ్ హైలెట్స్:

వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన పంజాబ్
5 - ఉప్పల్ స్టేడియం పంజాబ్‌కు అచ్చొచ్చిన మైదానం కాదు. ఈ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడిన గత చివరి ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఈ స్టేడియంలో పంజాబ్ 2014 ఐపీఎల్ సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది.
8 - ఈ మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ విధ్వంసం కొనసాగింది. పంజాబ్‌తో తలపడిన గత ఎనిమిది సందర్భాల్లోనూ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీలను నమోదు చేయడం విశేషం. 2014-16 మధ్య కాలంలో ఆర్సీబీపై వార్నర్ వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు.

వార్నర్ ఇప్పటివరకు చేసిన సెంచరీలు
10 - మొత్తంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు చేసిన సెంచరీలు. ప్రత్యర్ధి జట్టుపై ఓ ఆటగాడు నమోదు చేసిన అత్యధిక హాఫ్ సెంచరీలు ఇవే కావడం విశేషం.
212/6 - ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నమోదు చేసిన స్కోరు. ఈ స్కోరు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నమోదు చేసిన 231/2 పరుగులే ఇప్పటివరకు అత్యధిక స్కోరు కావడం విశేషం.

ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఖాతాలో ఓ చెత్త రికార్డు
66 - ఈ మ్యాచ్‌లో ముజీబ్ ఉర్ రెహ్మాన్ 4 ఓవర్లలో ఇచ్చిన పరుగులు. ఐపీఎల్‌లో ఓ బౌలర్ ఇచ్చిన రెండో అత్యధిక పరుగులు. సన్‌రైజర్స్ బౌలర్ బసిల్ థంపి ఐపీఎల్‌లో అత్యధికంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ రికార్డుని ఇంతవరకు ఏ బౌలర్ కూడా బద్దలు కొట్టలేదు.
66 - ఐపీఎల్‌లో 60 లేదా అంతకుమించి పరుగులిచ్చిన తొలి స్పిన్నర్‌గా ముజీబ్ ఉర్ రెహ్మాన్ నిలిచాడు. 2016 ఐపీఎల్ సీజన్‌లో ఇమ్రాన్ తాహిర్ (59) పరుగుల రికార్డుని ఇప్పుడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ బద్దలు కొట్టాడు.

రషీద్ ఖాన్ ఖాతాలో 50 వికెట్లు
52 - పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ వికెట్ తీయడంతో ఐపీఎల్‌లో 50 వికెట్లు తీసిన ఆటగాడిగా రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్. రషీద్ ఖాన్‌కు ముందు భువనేశ్వర్ కుమార్ (104) ఈ ఘనత సాధించాడు.
18 - ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 18 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో ఒక వేదికలో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రెండో ఆటగాడిగా వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఆర్సీబీ కెప్టెన్ వార్నర్ కంటే ముందంజలో ఉన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ 70 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 19 హాఫ్ సెంచరీలు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications