IPL 2019: Match 43, KKR vs RR: గెలిచి ప్లేఆఫ్ బరిలో నిలిచేదెవరు?

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌ను ఎంతో ఘనంగా ఆరంభించిన కోల్‌కతా ఆ తర్వాత వరుస ఓటములతో సతమతమవుతోంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఆడిన 10 మ్యాచ్‌ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ పరిస్థితి అంతే ఉంది. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

ఓడిన జట్టుకు ఆశలు గల్లంతే
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీతో బరిలోకి దిగినప్పటికీ అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌లోనూ అబిమానులను నిరాశపరుస్తోంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగా... ఓడిన జట్టుకు ఆశలు గల్లంతే.

కోల్‌కతా తొలుత బ్యాటింగ్ చేస్తే!
ఐపీఎల్‌లో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకటి. అయితే, గత కొన్ని మ్యాచ్‌లుగా సమిష్టిగా రాణించడంలో విఫలమవుతున్నారు. ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇప్పటికే ఒంటి చేత్తో రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ను గెలిపించాడు. అయితే, టాపార్డర్ ఆటగాళ్లు క్రిస్ లిన్, శుభమాన్ గిల్, నితీశ్ రాణా, కెప్టెన్ దినేశ్ కార్తీక్‌లు నిలకడగా రాణించకపోవడం ఆ జట్టుని దెబ్బతీస్తోంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేస్తే 180 నుంచి 190 వరకు పరుగులు చేసే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తే
జోస్ బట్లర్ స్వదేశానికి పయనం కాడవంతో రాజస్థాన్ మిడిలార్డర్ బలహీనమైంది. మరో ఆటగాడు బెన్ స్టోక్స్ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టాప్-3 ఆటగాళ్లు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే, గత మ్యాచ్‌లో సెంచరీ చేసి రహానే చక్కటి ఫామ్‌ని అందుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు గత కొన్ని మ్యాచ్‌లుగా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఫరవాలేదనిపిస్తున్నాడు. సీజన్ ఆరంభంలో సంజూ శాంసన్ మెరుపులు మెరిపించినప్పటికీ నిలకడ లోపించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేస్తే 170 పరుగులు చేసే అవకాశం ఉంటుంది.

విజయం ఎవరిని వరిస్తుంది?
ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్ బరిలో ఉంటారు. సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతుండటంతో కోల్‌కతానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications