IPL 2019: CSK vs SRH మ్యాచ్‌లో నమోదైన గణాంకాలు, రికార్డులు

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు షేన్ వాట్సన్ 53 బంతుల్లో 96 (9 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఈ సీజన్‌లో ఫ్లే ఆఫ్ బెర్త్ సొంతం చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో షేన్ వాట్సన్ విజృంభించడంతో 19.5 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 176 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. SRH vs CSK మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డులు...

డేవిడ్ వార్నర్ స్పెషల్
ఐపీఎల్‌లో ప్రత్యర్ధి జట్టుపై ఐదు లేదా అంతకుమించి వరుసగా హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక్ బ్యాట్స్‌మన్‌గా డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు యొక్క ప్రత్యేక ఏంటంటే ఐపీఎల్‌లో మూడు జట్లపై వార్నర్ దీనిని నెలకొల్పడం. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సాధించిన హాఫ్ సెంచరీ చెన్నైపై వరుసగా 5వ హాఫ్ సెంచరీ. ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్ జట్టుపై వార్నర్(71 నాటౌట్) పరుగులు ఆ జట్టుపై 7వ హాఫ్ సెంచరీ. 2014 నుంచి 2016 మధ్య కాలంలో వార్నర్ ఆర్సీబీ జట్టుపై కూడా వరుసగా 7 హాఫ్ సెంచరీలు సాధించాడు.

పాండే హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో మనీష్ పాండే 25 బంతుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీని సాధించాడు. ఈ హాఫ్ సెంచరీ ఐపీఎల్‌లో పాండేకు అత్యంత వేగంగా నమోదు చేసిన హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకు పాండే 14 సార్లు 50కిపైగా పరుగులు సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండే 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

సన్‌రైజర్స్‌పై వాట్సన్ రికార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అంటే చాలు షేన్ వాట్సన్ చెలరేగి ఆడతాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో షేన్ వాట్సన్ మొత్తం 523 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుని సైతం వాట్సన్ అధిగమించాడు. సన్‌రైజర్స్‌పై మొత్తం 16 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన షేన్ వాట్సన్ 37.35 యావరేజితో ఈ పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మంగళవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్ 96 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications