
హైదరాబాద్: ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీలో భాగంగా సోమవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 14 పాయింట్లతో పాయింట్ల పట్టకలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ సైతం 14 పాయింట్లను కలిగి ఉన్నప్పటికీ రన్‌రేట్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త మెరుగ్గా ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.
పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవడంతో ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. "వామ్మో ఢిల్లీ అగ్రస్థానమా? నమ్మలేకపోతున్నాం" అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా... మరొక నెటిజన్ "అప్పుడెప్పుడో ఢిల్లీ అగ్రస్థానమని చదివా.. కానీ అది కాలుష్య జాబితాలో అని తెలిసి నిట్టూర్చా. కానీ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం అంటే నమ్మలేకపోతున్నా" అని ట్వీట్ చేశాడు.
ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్‌పై ఫన్నీ మీమ్స్ మీకోసం: