Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KXIP vs RR: రాజస్థాన్ ఫీల్డింగ్, మార్పులతో బరిలోకి పంజాబ్

IPL 2019: Match 32, KXIP vs RR: Rajasthan Royals win the toss and elect to field

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ అజ్యింకె రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

పంజాబ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. శామ్ కర్రన్ స్థానంలో డేవిడ్ మిల్లర్‌ని తుది జట్టులోకి తీసుకుంది. రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఇకపై జరిగే మ్యాచుల్లోనూ తప్పక గెలవాలి. ఇక, రాజస్థాన్ మాత్రం జట్టులో మూడు మార్పులు చేసింది.

ఆస్టన్ టర్నర్, స్టువర్ట్ బిన్ని, ఇష్ సోదీలకు రాజస్థాన్ జట్టులో చోటు కల్పించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. కాగా, ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడిన మొదటి మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ను అశ్విన్‌ మన్కడింగ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది.

1
45908

జట్ల వివరాలు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, అశ్విన్, మహ్మద్ షమీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, హర్షదీప్ సింగ్

రాజస్థాన్ రాయల్స్
రహానే, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, ఆస్టన్ టర్నర్, స్టువర్ట్ బిన్నీ, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కత్, ధావల్ కులకర్ణి, ఇష్ సోధీ

Story first published: Tuesday, April 16, 2019, 19:54 [IST]
Other articles published on Apr 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+