పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. సన్‌రైజర్స్‌కు విజయం దక్కేనా?


ఐపీఎల్ లీగ్‌లో భాగంగా మొహాలీ వేదికగా ఈ రోజు రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు కూడా గత మ్యాచ్‌లలో ఓటమిని చవిచూశాయి. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ చేతిలో రైజర్స్ ఓడిపోగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓటమిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు విజయంపై దృష్టి సారించాయి. మరి ఈ రసవత్తర పోటీలో సన్‌రైజర్స్‌కు విజయం దక్కేనా?.

రైజర్స్ బ్యాటింగ్ పదునెక్కాలి:
సన్‌రైజర్స్ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలపైనే ఆశలు పెట్టుకుంది. ఈ జోడి మరోసారి శుభారంభం అందిస్తేగాని సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేసే అవకాశం ఏర్పడింది. ఈ ఇద్దరి తర్వాత వచ్చే విజయ్ శంకర్ అంతగా ఆకట్టుకోలేదు. మిడిలార్డర్ ఆటగాళ్లు యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండే, దీపక్ హుడాలు ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో రికీ భుయ్, సాహాలు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ నబీ కూడా బ్యాట్ జులిపించాల్సి ఉంది. మొత్తానికి రైజర్స్ బ్యాటింగ్ పదునెక్కితేనే భారీ స్కోర్ చేయడం సాధ్యమవుతుంది.

పేసర్లు గాడిలో పడాలి:
సన్‌రైజర్స్ ముగ్గురు ప్రధాన పేసర్లతో ఆడుతోంది. భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, సందీప్‌శర్మలతో పేస్ బలం బాగున్నా.. ఆశించిన మేర ఫలితాలు రావట్లేదు. మొహాలి పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో వారు స్థాయికి తగినట్లుగా ఆడితే మ్యాచ్ గెలిపించవచ్చు. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ ఆకట్టుకుంటున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు బౌలింగ్ లో పటిష్టంగానే ఉంది.

గేల్, మిల్లర్‌లు చెలరేగితేనే:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో గేల్, మిల్లర్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. గెలుపుపై నమ్మకం లేదు. ఎందుకంటే వీరు ఎప్పుడు ఆడతారో తెలియని పరిస్థితి. అయితే ఈ ఇద్దరు చెలరేగితేనే స్కోర్ పరుగులు పెడుతుంది. మరోవైపు రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లు ధాటిగా ఆడలేకపోతున్నారు. మయాంక్ అగర్వాల్ రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. మన్దీప్ సింగ్, స్యామ్ కరన్‌లు కూడా చెలరేగాల్సిన అవసరం ఉంది.

కరన్‌కు సరిపోయే పిచ్ ఇది:
స్యామ్ కరన్ బౌలింగ్ కు ఈ పిచ్ సరిగ్గా సరిపోతుంది. భారత స్టార్ బౌలర్ షమీ, ఆండ్రూ టై కూడా రాణించాలని పంజాబ్ కోరుకుంటోంది. ఇక కెప్టెన్ అశ్విన్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటే.. సన్‌రైజర్స్‌కు కస్టాలు తప్పవు. అందరూ సమిష్టిగా రాణిస్తే పంజాబ్ ఖాతాలో మరో విజయం చేరుతుంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమవనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications