న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏమైంది ఆర్సీబీ ఆటగాళ్లకు!: సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు

IPL 2019 : Funny RCB Memes Going Viral After Kohli’s Team Lost The Match With SRH | Oneindia Telugu
IPL 2019: Match 11, SRH vs RCB- Funniest memes from the Match

హైదరాబాద్: ఐపీఎల్‌లో వరుస ఓటములను తట్టుకోలేకపోతున్నామని ఆర్సీబీ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 118 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సన్‌రైజర్స్‌ జట్టు ఓపెనర్లు బెయిర్‌స్టో (114), వార్నర్‌ (100)లు సెంచరీలతో చెలరేగడంతో 231 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 113 పరుగులకే ఆలౌట్ అయి భారీ ఓటమిని ఎదుర్కొంది. దీంతో బెంగళూరు వరుసగా మూడో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

పార్థివ్‌ పటేల్‌, హెట్‌మయర్‌, డివిలియర్స్‌, విరాట్ కోహ్లీ, మొయిన్‌ అలీ, గ్రాండ్‌హోమ్‌ వంటి ఆటగాళ్ళు ఉన్నప్పటికీ ఆర్సీబీ వరుస పరాజయాల పాట పడుతోంది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మిస్టర్ 360 రాణించకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఈ ఓటములను తట్టుకోలేకపోతున్నామని ఆర్సీబీ అభిమానులు సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'ఏమైంది ఆర్సీబీ ఆటగాళ్లకు' అంటూ ఓ అభిమాని తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. 'మీరు ఓటమిని తట్టుకుంటున్నారు కావొచ్చు.. ఆర్సీబీ ఫ్యాన్స్‌గా తట్టుకోలేకపోతున్నాం' అని మరొకరు కామెంట్‌ చేశారు. 'ఆర్సీబీ జట్టు ప్రతి జట్టుకు 2 పాయింట్లు ఇస్తుంది'. 'కోహ్లీ ఐపీఎల్ ఆడుతున్నాం.. క్లబ్ క్రికెట్ కాదు' అని కామెంట్లు చేశారు. ఇక మరికొందరు అయితే వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ.. తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Monday, April 1, 2019, 14:37 [IST]
Other articles published on Apr 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X