ముంబై ఇండియన్స్ తొలి 6 మ్యాచ్‌లకు మలింగ దూరం


హైదరాబాద్: పేస్ బౌలర్ లసిత్ మలింగ సేవలను ముంబై ఇండియన్స్ కొల్పోనుంది. అయితే, ఇది మలింగ కేవలం ఆరు మ్యాచ్‌లకే దూరం కానున్నాడు. శ్రీలంక ప్రపంచకప్ జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలంటే ఆటగాళ్లు దేశవాళీ వన్డే టోర్నమెంట్లో ఆడాలని ఆ దేశ సెలక్టర్లు చెప్పారు. దీంతో ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 11 వరకు జరగనున్న శ్రీలంక సూపర్ ప్రొవినికల్ వన్డే దేశవాళీ టోర్నీలో పాల్గొనేందుకు ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం కావాలని మలింగ నిర్ణయించుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మలింగ మాట్లాడుతూ
దీనిపై ఈఎస్పీఎస్ క్రిక్ ఇన్ఫోతో మలింగ మాట్లాడుతూ "ఐపీఎల్‌లో ఆడేందుకు బోర్డుని నో అజ్జెక్షన్ సర్టిఫికెట్ అడిగాను. ప్రపంచకప్ జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలంటే ఆటగాళ్లు దేశవాళీ వన్డే టోర్నమెంట్లో ఆడాలి" అని చెప్పారు.

ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెప్పా
"దీంతో శ్రీలంక సూపర్ ప్రొవినికల్ ఆడాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యానికి వెల్లడించా. ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగానే ఉన్నా. ఎందుకంటే, ఇది నా దేసం కోసం చేస్తున్నా కాబట్టి" అని లసిత్ మలింగ అన్నాడు.

రూ.2 కోట్లకు మలింగను కోనుగోలు చేసిన ముంబై
ఐపీఎల్ 2019 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో మలింగను ముంబై ఇండియన్స్ జట్టు కనీస ధర రూ.2 కోట్లుకు కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గతే సీజన్‌లో మలింగ ముంబై ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ మెంటార్‌గా వ్వవహారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మలింగ శ్రీలంక జట్టు వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

సూపర్ ఫామ్‌లో మలింగ
గత ఆరు నెలలుగా మలింగ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ జట్టులో మలింగ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications