
హైదరాబాద్: చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సురేశ్ రైనా 37 బంతుల్లో 59(8 ఫోర్లు, సిక్స్), ధోని 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీకి 180 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సుచిత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి వాట్సన్ ఖాతా తెరవకుండానే అక్షర పటేల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనాతో కలిసి డుప్లెసిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
ఈ క్రమంలో వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 83 పరుగులు జోడించారు. సురేశ్ రైనా 37 బంతుల్లో 59(8 ఫోర్లు, సిక్స్)తో హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్ మూడో బంతికి డుప్లెసిస్(39) ధావన్‌కు క్యాచ్ ఔటయ్యాడు. దీంతో జట్టు స్కోరు 87 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత కొద్ది సేపటికే జట్టు స్కోరు 102 పరుగుల వద్ద సుచిత్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతికి రైనా(59) ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన జడేజా దూకుడగా ఆడాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 25 పరుగులు చేసి క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
వికెట్లు ఉండటంతో చివర్లో అంబటి రాయుడు సహకారంతో చివర్లో ధోని 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ట్ర్ంట్ బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు రాబట్టడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో సుచిత్ రెండు, మోరిస్, అక్షర్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్‌కు ఇది 200వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో తుది జట్టులోకి తిరిగొచ్చిన ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు.
దీంతో పాటు చెన్నై మరో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మిషెల్ శాంట్నర్, మురళీ విజయ్‌ల స్థానంలో డుప్లెసిస్, జడేజాలు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మోరవైపు ఢిల్లీ కూడా రెండు మార్పులు చేసింది. ఇషాంత్ శర్మ, కగిసో రబాల స్థానంలో ట్రెంట్ బోల్ట్, సుచిత్‌లకు చోటు కల్పించింది.
ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నఈ రెండు జట్లు ఈ సీజన్‌లో తలపడటం ఇది రెండోసారి. చివరగా ఢిల్లీ వేదికగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లు తేడాతో విజయం సాధించింది.
అయితే, గత రెండు, మూడు మ్యాచ్‌లుగా సీఎస్‌కే ఆటగాళ్లు ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. సీఎస్‌కే చివరగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిపోయింది. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
అంతేకాదు ఏడేళ్లలో తొలిసారి ప్లేఆఫ్‌కు చేరింది. ఢిల్లీ విజయాల్లో ధావన్, రబాడ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు చెన్నై కూడా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికీ రన్ రేట్ విషయంలో ఢిల్లీ కాస్త మెరుగ్గా ఉంది.
జట్ల వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కొలిన్ ఇన్‌గ్రామ్, రూథర్‌ఫర్డ్, అక్షర పటేల్, అమిత్ మిశ్రా, సందీప్ లమిచానే, ట్రెండ్ బౌల్ట్, జగదీశా సుచిత్ర
చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, డుప్లెసిస్, మురళీ విజయ్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్