Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయస్‌ గోపాల్‌ 'హ్యాట్రిక్‌'.. ఐపీఎల్‌లో 16వ బౌలర్‌

IPL 2019: List of Indian Premier League hat-tricks: From Laxmipathy Balaji to Shreyas Gopal

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో భాగంగా మంగళవారం రాత్రి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్ శ్రేయస్‌ గోపాల్‌ 'హ్యాట్రిక్‌' సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ సాధించిన 16వ బౌలర్‌గా శ్రేయస్‌ గోపాల్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఐపీఎల్‌లో ఈ హ్యాట్రిక్‌ మాత్రం 19వది. ఈ సీజన్‌లో ఇది రెండో 'హ్యాట్రిక్‌'.

మ్యాచ్‌కు వరణుడు అడ్డు:

మ్యాచ్‌కు వరణుడు అడ్డు:

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను వరణుడు అడ్డుకున్నాడు. టాస్‌ అనంతరం స్టేడియంలో వర్షం కురిసింది. వర్షం పూర్తిగా తగ్గాక అంపైర్లు పలుమార్లు పిచ్‌ను, ఔట్‌ ఫీల్డ్‌ను పరిశీలించారు. సమయం ఎక్కువగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు.

గోపాల్‌ హ్యాట్రిక్‌:

గోపాల్‌ హ్యాట్రిక్‌:

బెంగళూరు ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ (25; 7 బంతుల్లో 1×4, 3×6), ఏబీ డివిలియర్స్‌ (10; 4 బంతుల్లో 2×4) తొలి ఓవర్లోనే 23 పరుగులు చేశారు. రెండో ఓవర్‌లో శ్రేయాస్‌ గోపాల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. మొదటి మూడు బంతులకు కోహ్లీ 6,4,2 పరుగులు చేసాడు. నాలుగో బంతిని కూడా కోహ్లీ బాదేందుకు ప్రయత్నించాడు. లాంగాన్‌లో లివింగ్‌ స్టోన్‌ క్యాచ్‌ పట్టడంతో కోహ్లీ నిష్క్రమించాడు. ఆ మరుసటి బంతికే డివిలియర్స్‌.. పరాగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి బంతికి స్టొయినిస్‌ (0) స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో 'హ్యాట్రిక్‌' తీసిన 16వ బౌలర్‌గా శ్రేయస్‌ గోపాల్‌ గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు లీగ్‌ చరిత్రలో మొత్తం 19 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అయితే ఈ సీజన్‌లో ఇది రెండో 'హ్యాట్రిక్‌'.

ఐపీఎల్‌లో 16వ బౌలర్‌:

ఐపీఎల్‌లో 16వ బౌలర్‌:

ఐపీఎల్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ సాధించిన 16వ బౌలర్‌గా శ్రేయాస్‌ గోపాల్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో అత్యధిక హ్యాట్రిక్‌ (3)లు సాధించాడు. యువరాజ్ సింగ్ 2 హ్యాట్రిక్‌లు సాధించాడు. ముఖాయ ఎన్తిని, లక్ష్మీపతి బాలాజీ, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, అజిత్ చండిలా, సునీల్ నరైన్, ప్రవీణ్ తంబే, షేన్ వాట్సన్, అక్షర్ పటేల్, సామ్యూల్‌ బద్రీ, ఆండ్రూ టై, జైదేవ్‌ ఉనాద్కట్‌, స్యామ్‌ కరన్‌, శ్రేయస్‌ గోపాల్‌లు తలో హ్యాట్రిక్‌ సాధించారు.

సీజన్‌-12లో తొలి హ్యాట్రిక్‌:

సీజన్‌-12లో తొలి హ్యాట్రిక్‌:

ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్‌ కరన్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో అతి పిన్న వయసులో (20 ఏళ్ల 302) హ్యాట్రిక్‌ సాధించిన ఆటగాడిగా కరన్‌ నిలిచాడు. మరోవైపు ఐపీఎల్ సీజన్‌-12లో తొలి హ్యాట్రిక్‌ అందుకున్న బౌలర్ కూడా సామ్‌ కరన్‌నే. మ్యాచ్‌లో సామ్‌ 2.2 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీసాడు. 18వ ఓవర్‌ చివరి బంతికి హర్షల్‌ను.. 20వ ఓవర్‌ తొలి రెండు బంతులకి రబడ (0), లమిచానే (0)లను క్లీన్‌బౌల్డ్‌ చేసి హ్యాట్రిక్‌ అందుకున్నాడు.

Story first published: Wednesday, May 1, 2019, 10:54 [IST]
Other articles published on May 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+