
క్రిస్‌గేల్ - 175 నాటౌట్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు )
2013 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడిన క్రిస్‌గేల్.. పుణె వారియర్స్ జట్టుపై కేవలం 66 బంతుల్లోనే 13 ఫోర్లు, 17 సిక్సుల సాయంతో ఏకంగా 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో.. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఇప్పటికీ ఈ రికార్డు కొనసాగుతోంది.

బ్రెండన్ మెక్‌కలమ్ - 158 నాటౌట్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
టీ20 క్రికెట్ మజాని క్రికెట్ అభిమానులకి పరిచయం చేసిన ఇన్నింగ్స్ ఇది. 2008 ఆరంభ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి ఆడిన మెక్‌కల్లమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

ఏబీ డివిలియర్స్ - 133 నాటౌట్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
ఐపీఎల్ చరిత్రలో అభిమానుల్ని అమితంగా ఆకర్షించిన ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటి. 2015 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఆడిన ఏబీ డివిలియర్స్ ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లోనే 19 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ ఒక వికెట్ నష్టానికి ఏకంగా 235 పరుగులు చేసింది.

ఏబీ డివిలియర్స్ - 129 నాటౌట్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
ఐపీఎల్ 2016 సీజన్‌లో ఏబీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే 12 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో ఏబీ 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడటంతో ఆ మ్యాచ్‌లో బెంగళూరు ఏకంగా 248 పరుగులు చేసింది.

రిషబ్ పంత్ - 128 నాటౌట్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్)
2018 ఐపీఎల్ సీజన్‌లో రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. గతేడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ఆడిన రిషబ్ పంత్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 7 సిక్సర్లు, 15 ఫోర్ల సాయంతో 128 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో రిషబ్ పంత్ కొట్టిన స్వీప్ షాట్లు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. పంత్ సెంచరీతో ఆ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 187 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications













